చెప్పిన పని చేయకుండా తిట్టాడని..

19 May, 2020 14:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అల్లుడిపై కత్తితో దాడి చేసిన మేనమామ

కోయంబత్తూర్‌ : తన నోటిలో పెట్టుకున్న సిగరెట్‌ను వెలిగించకపోగా, ఎదురు తిరిగి తిట్టాడన్న కోపంతో మేనల్లుడిపై కత్తితో దాడి చేశాడో వ్యక్తి. ఈ సంఘటన తమిళనాడులోని రామనాధపురంలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రామనాధపురానికి చెందిన యోగేశ్‌ అనే 15ఏళ్ల బాలుడు కొద్దిరోజుల క్రితం మేనమామ మణికందన్‌ ఇంటికి వచ్చాడు. శనివారం రోజు మణికందన్‌ తన నోట్లో పెట్టుకున్న సిగరెట్‌ను వెలిగించాల్సిందిగా యోగేశ్‌ను అడిగాడు. ఇందుకు అతడు అంగీకరించలేదు సరికదా మణికందన్‌ను తిట్టాడు. దీంతో ఆగ్రహానికి గురైన అతడు యోగేశ్‌పై కత్తితో దాడి చేసి, అక్కడినుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన యోగేశ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించగా ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మణికందన్‌ కోసం గాలిస్తున్నారు.

చదవండి : తండ్రీకొడుకులను కాల్చి చంపేశారు..

మరిన్ని వార్తలు