గోనె సంచిలో చిన్నారి ద్వారక మృతదేహం

11 Nov, 2019 17:51 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఇంటి ముందు ఆడుకుంటూ నిన్న సాయంత్రం అదృశ్యమైన చిన్నారి ద్వారక మువ్వ ఉదంతం విషాదంగా ముగిసింది. పక్కింట్లోనే చిన్నారి మృతదేహం ఓ గోనె సంచిలో లభ్యమైంది. పక్కింట్లో నివాసం ఉంటున్న ప్రకాష్‌ అనే వ్యక్తి ... ద్వారకపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే..ఇబ్రహీంపట్నం సమీపంలోని నల్లకుంటలో ఎనిమిదేళ్ల చిన్నారి ద్వారకా మువ్వ ఆదివారం సాయంత్రం ఆడుకోవడానికి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. 

ద్వారక తల్లి ఇంటి పక్కనే ఉన్న కళాశాలలో స్వీపర్‌గా పనిచేస్తోంది. పని ముగించుకుని ఆమె ఇంటికి వచ్చినా.. కూతురు మాత్రం ఇంటికి తిరిగి రాలేదు. చుట్టుపక్కల ప్రాంతాలు, బంధువుల ఇళ్లల్లో వెతికినా ఆచూకి తెలియలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం ఆ ప్రాంతంలో ఉన్న అన్ని సీసీటీవీ పుటేజీ కెమెరాలను పరిశీలించినా ఆధారాలు లభించలేదు. దీంతో చుట్టుపక్కల ఇళ్లను తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలో ద్వారక ఉంటున్న పక్కింట్లోనే చిన్నారి మృతదేహం లభ్యమైంది. 

ప్రకాష్‌...అత్యాచారానికి పాల్పడి అనంతరం హతమార్చి, మృతదేహాన్ని గోనె సంచిలో మూటగట్టి ఇంట్లోనే దాచాడు. అయితే భర్త ప్రవర్తన తేడాగా ఉండటాన్ని గమనించిన ప్రకాష్‌ భార్య ఇంట్లో వెతకగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ప్రకాష్‌ పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. మరోవైపు కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

చదవండిఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం.. ఆపై హత్య?

వర్షిత హంతకుడు ఇతడే!

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా