మరింత క్షీణించిన పారిశ్రామికోత్పత్తి

11 Nov, 2019 17:51 IST|Sakshi

సాక్షి, ముంబై: ఆర్థిక మందగమనంపై ఆందోళన కొనసాగుతుండగానే, పారిశ్రామిక పురోగతి మైనస్‌లోకి జారుకోవడం మరింత భయపెడుతోంది. సెప్టెంబరు  ఐఐపీ డేటా మరింత  పతనమై వరుసగా  రెండో నెలలో కూడా క్షీణతనునమోదు  చూసింది.  సెప్టెంబరు ఐఐపీ డేటా -4.3 శాతంగా ఉంది. గత నెలలో 1.1శాతంతో పోలిస్తే పారిశ్రామికోత్పత్తి సూచీ  అంచనా వేసిన దానికంటే దిగువకు చేరింది.  గత ఏడాది  సెప్టెంబరు నెల ఐఐపీ  డేటా 4.5 శాతంగా ఉంది.  

గణాంక విభాగం విడుదల చేసిన డేటా ప్రకారం మైనింగ్, తయారీ, విద్యుత్  ఇలా అన్ని విభాగాల్లో ఉత్పత్తి తగ్గుదల కనిపించింది. ఇది తీవ్ర ఆర్థిక మాంద్యాన్ని సూచిస్తుంది. పెట్టుబడి డిమాండ్‌ 20.7 శాతానికి పతనమైంది. ఎనిమిది మౌలిక సదుపాయాల రంగాలను సూచించే  కోర్‌ సెక్టార్ డేటా  -5.2 శాతం‌ వద్ద 14 సంవత్సరా కనిష్టానికి చేరింది. పారిశ్రామిక ఉత్పత్తిలో కోర్  సెక్టార్‌ వాటా 40 శాతం. పారిశ్రామిక వృద్ధిలో నిరంతర మందగమనం  కారణంగా ఆర్‌బీఐ  డిసెంబరులో పాలసీ రివ్యూలో మరోసారి రేటు కోత వెళ్లక తప్పదని నిపుణులు అంచనావేస్తున్నారు. 

మరిన్ని వార్తలు