భర్త మందలించాడని చేయి కోసుకున్న భార్య

10 Jan, 2020 09:24 IST|Sakshi
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కవిత

అనంతపురం, ధర్మవరం అర్బన్‌: భర్త మందలించాడని క్షణికావేశంలో ఓ వివాహిత కత్తితో చేయికోసుకున్న ఘటన గురువారం సాయంత్రం పట్టణంలోని శాంతినగర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు శాంతినగర్‌కు చెందిన శివ, కవితలు మగ్గం నేస్తూ జీవనం సాగించేవారు. అయితే శివ మొదటి భార్య చనిపోవడంతో పెద్దల సూచనమేరకు కవితను పెళ్లిచేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇంటిలో బిడ్డకు కవిత అన్నం సరిగా తినిపించలేదని భర్త శివ మందలించాడు. దీంతో వారిద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. ఎదురు తిరగడంతో భార్య కవితపై శివ చేయిచేసుకున్నాడు. దీంతో క్షణికావేశంతో ఆమె ఇంటిలో ఉన్న కత్తితో చేతికి కోసుకుంది. వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు