నెట్టింట్లో నగ్నసత్యం

11 May, 2018 09:33 IST|Sakshi

క్లిక్‌ చేస్తే లక్షల్లో పోర్న్‌సైట్లు

అరచేతిలో విచ్చలవిడిగా శృంగారం 

హింసను ప్రోత్సహిస్తున్న అశ్లీల సాహిత్యం

మీ పిల్లలు ఇంటర్నెట్‌లో ఏంచేస్తున్నారు ... ఏం చూస్తున్నారో మీకు తెలుసా ... తరగతికి సంబంధించిన పాఠాలుచూస్తున్నారు కదా అని మీరు వదిలేస్తే పప్పులో కాలేసినట్టే ... క్లాస్‌ పాఠాల కోసం పిల్లలకు కంప్యూటర్లు, నెట్‌ కనెక్షన్లు ఇస్తేకొందరు కామ పాఠాలు వెతుక్కుంటున్నారు. నగ్న చిత్రాలను నెట్టింట్లోనే చూస్తున్న పిల్లలు దేశంలోనేకోట్లల్లో వున్నారు. అరచేతిలో శృంగారం అందుబాటులోకి రావడంతో నీలిప్రపంచానికి యువత బానిసగా మారుతోంది.వారిలో హింస ప్రవృత్తి పెరిగిపోయి లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అలాంటి వారినినియంత్రించడానికి కేంద్రం పోర్న్‌సైట్లపై కొరడా ఝుళిపిస్తున్నా వారి యత్నాలు బెడిసి కొడుతున్నాయి. వీటిని పూర్తిగాకట్టడి చేయకుంటే దీని ప్రభావం ఎక్కువగా వుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

తిరుపతి క్రైం: ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తున్న జీవన శక్తి ఇంటర్నెట్‌. సమస్త ప్రపంచాన్ని అరచేతిలో మడిచిన సాంకేతిక తంత్రం. ప్రపంచంలో సగా నికి పైగా సంస్థలు పనిచేయాలంటే ఇంటర్నెట్‌ ఖచ్చితంగా వుండాల్సిందే. అలా మన లైఫ్‌ స్టైల్‌లో ఇంటర్నెట్‌ అత్యవసరమైపోయింది. ఎంతలా అంటే  ఒక పదినిమిషాలు ఇంటర్నెట్‌ లేకపోతే లక్షకోట్లు నష్టం వచ్చే పరిస్థితులు కూడా నెలకొన్నాయి. యువత అయితే రోజంతా తిండి లేకపోయినా వుండరేమోగాని సెల్‌ఫోన్‌ ఇంటర్నె ట్‌ లేకుండా ఒకక్షణం కూడా వుండలేక పోతున్నా రు. ఇ దంతా  ఇంటర్నెట్‌కు, ఇన్పర్మేషన్‌ టెక్నాలజీకి ఒక కోణం మాత్రమే. కానీ మనకు తెలియని కూడా వుంది. అది ప్రపంచానికి తెలియని నీలికో ణం. ఒకసారి బానిస అయితే చాలు ఇక ఎవరినీ వదలిపెట్టదు.

మదనపల్లిలో ఓ యువకుడు ఓ బాలికపై అత్యాచారయత్నం చేశాడు. ఆ బాలిక తల్లిదండ్రులు కేసు పెట్టేందుకు నిరాకరించడంతో నమోదు కాలేదు. అయితే పోలీసులు తమదైన శైలిలో యువకున్ని విచారించగా అశ్లీల సైట్లు అధికంగా చూడడం వల్ల బాలికపై అత్యాచార యత్నానికిపాల్పడినట్లు తేలింది.  శ్రీకాళహస్తిలో కూడా ఓ మహిళపై అత్యాచార యత్నం జరిగింది. ఆ కేసులోని నిందితులు కూడా పోలీసుల విచారణలో ఆసక్తికరమైన నిజాలు వెల్లడించారు. నిత్యం అశ్లీల వీడియోలను చూడటం వల్ల వారికి ఇలాంటి కోరికలు పుట్టినట్లు, అదే ప్రస్తుతం తీవ్రమైనట్లు పోలీసులు నిర్ధారించారు.  

కట్టడికి కేంద్రం కసరత్తు
భావితరాలను తప్పటడుగులోకి తీసుకెళుతున్న ఈ నీలిలోకానికి తలుపులు వేయడానికి ప్రయత్నిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇంటర్నెట్‌లో పెట్రేగిపోతున్న పోర్న్‌సైట్‌లపై కొరడా ఝుళిపించింది. సర్వీస్‌ ప్రొవైడర్లసాయంతో ఇండియన్‌ ఇంటర్నెట్‌లో విహరిస్తున్న 875 పోర్న్‌సైట్‌లను, వాటి యూఆర్‌ఎల్, ఐపీ లింక్‌లను బ్లాక్‌  చేయగలిగింది. ప్రస్తుతానికి పబ్లిక్, ప్రైవేటు మొబైల్‌ డేటా ప్రొవైడర్ల సాయంతో ఈ అశ్లీలత సైట్‌లను అరికట్టేందుకు తొలి అడుగులు వేసినా పలురకాల దారుల్లో ఇంటర్నెట్‌కు చేరుతున్న పోర్న్‌ సైట్‌లను కూడా పూర్తిగా అరికట్టేందుకు నిపుణులు కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో జరిగే అత్యాచారాలు, అకృత్యాలు ఈ పోర్న్‌సైట్‌ల కారణంగానే అని క్రైం బ్యూరో భావిస్తుండగా విచారణలో సైతం నిందితులు ఇదే విషయాలను వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై ప్రభుత్వం మరింత చొరవ చూపి ఈసైట్‌లను పూర్తిగా కట్టడి చేయకుంటే మాత్రం దీనిప్రభావం చాలా తీవ్రతరంగా వుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో వీటిని పూర్తిగా అరికట్టడంతో ఆయా దేశాల్లో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గినట్టు లెక్కలు చెబుతున్న నేపథ్యంలో మనదేశం కూడా దీనిని పూర్తిగా నియంత్రించాల్సిందేనని ప్రజలు కోరుకుంటున్నారు.

పోర్న్‌ సైట్స్‌తోనే నేరాలు అధికం
ఇంటర్నెట్‌లో వచ్చే విచ్చలవిడి పోర్న్‌ సైట్స్‌ కారణంగా నేరాలు అధికమవుతున్నాయి. వీటిని నిరో« దించడానికి ప్రభుత్వాలు ఎన్ని ప్ర యత్నాలు చేసినా ఏదో ఒక రూ పంలో అందుతున్నాయి. వీటికి బానిసైన యువకులు లైంగిక దాడులకు పాల్పడుతున్నా రు. పలు కేసుల విచారణలో ఈ విషయం స్పష్టమైంది. ప్రజలు, తల్లిదండ్రులు కూడా వీటిపై అవగాహన పెం చుకుని చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించాలి. మహిళలపట్ల గౌరవం పెరగేలా వారిని తీర్చిదిద్దాలి. అది దగ్గరగా వున్న వ్యక్తులే అత్యాచారాలకు పాల్పడుతుండడం విచారకరం. ఇవన్నీ కూడా పెరిగిన సాంకేతిక కారణాల వల్ల జరుగుతున్నాయని క్రైం బ్యూరో తెలుపుతోంది.    – మునిరామయ్య, ఈస్టు డీఎస్పీ

చట్టాలు మరింత కఠినతరం
లైంగిక వేధింపులకు పాల్పడే వారిపై చ ట్టాలు కఠినతరంగా వున్నాయి. వీటిని మరింత కఠినతరం చేసి ఎవరైనా సరే సమాజంలో తిరిగి అలాంటి తప్పు చేసేందుకు భయపడేలా శిక్షలు వుండాలి. గత కొన్నేళ్లుగా ఇలాంటి కేసులు అధికమవుతుండడం దురదృష్టకరం. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, పెరిగిన టెక్నాలజీ, పోర్న్‌ వీడియోల ప్రభావం చాలా తీవ్రంగా వుంది. వీటిపై మరింత దృష్టి సారించి పూర్తిగా నియంత్రించాలి. – కెఎస్‌ శ్రీధర్, న్యాయవాది

దేశంపై పోర్న్‌ ప్రభావం
పోర్న్‌ వెబ్‌సైట్‌ల ప్రభావం దేశంపై తీవ్రంగా వుంది. ప్రధానంగా యువతతోపాటు మైనర్లు కూడా తప్పుదోవ పట్టడానికి కావడానికి ఈసైట్‌లే ప్రధానంగా కారణమవుతున్నాయి. ఏది మంచో ఏది చెడో తెలియని వయస్సులో అశ్లీలత్వానికి అలవాటుపడితే ఎన్ని ప్రమాదాలకు దారితీస్తుందో, ఎన్ని అఘాయిత్యాలకు దారితీస్తుందో వివరంగా క్రైమ్‌ బ్యూరోతో పాటు సామాజిక సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఇంటికి ఇంటర్నెట్‌ పెట్టిస్తే బాగుంటుందని ఏర్పాటు చేస్తే అదికాస్త పిల్లలను పక్కదారి పట్టిస్తోందని భయపడే తల్లిదండ్రులు కూడా ఎందరో వున్నారు. యాంటీ వైరస్‌లు, చైల్డ్‌ ప్రొటెక్షన్‌లు ఎన్ని పెట్టినా చేరాల్సిన అశ్లీలత సమాచారం చేరిపోతూనే ఉంది.

కోట్ల మంది బ్లూ డేటా వినియోగం
బ్లూలోకం టీనేజీలను బానిసగా మార్చుతున్న గమ్మత్తులోకం. తెలిసీ తెలియని వయస్సులో తెలియని విషయాలు తెలుసుకోవాలన్న తహతహతో వుండే వారికి ఇలాంటి సైట్లు ఆదిగురువులుగా మారుతున్నాయి. ఈ నీలి ప్రపంచానికి తెలియకుండానే బానిసలవుతున్నారు. చదువు సంధ్యలు పక్కనపెట్టి పక్కదారిపడుతున్నారు. ఒక యువతేకాదు ప్రముఖులు, వృద్ధుల వరకు ఈ నీలిచిత్రాలను చూస్తున్నారనే విషయం బహిరంగమవుతున్న తురణంలో పరిస్థితులు ఏస్థాయిలో వుందో అర్థమవుతుంది.

>
మరిన్ని వార్తలు