భారీ పొడవైన గిరి నాగుపాము కలకలం!

5 Apr, 2016 23:28 IST|Sakshi

చీడికాడ: విశాఖ జిల్లాలో అరుదైన ఓ సర్పం కనిపించింది. ఈ ఫొటోలో కనిపిస్తున్నది 12 అడుగుల పొడవైన గిరినాగు. విశాఖ జిల్లా చీడికాడ మండలం తురువోలులో మంగళవారం ఇది ప్రత్యక్షమైంది. కోటి కల్లంలో గల కోళ్లను తరుముతుండగా ఈ అరుదైన గిరి నాగుపాము ప్రత్యక్షం కావడంతో రైతులు మొదట కాసేపు పరుగులు పెట్టారు. అయితే, కొంత మంది ధైర్యం చేసి ఎలాగోలా చివరికి దాన్ని కొట్టి చంపేశారు. పాము శరీరమంతా లేత ఆకుపచ్చ రంగులో ఉండగా తోక భాగంలో అడుగు మేర నల్లటి రంగు, తెల్లటి చారలతో ఉందని, దాన్ని గిరి నాగుపాము అంటారని పామును చంపిన వారు వివరించారు.

 

మరిన్ని వార్తలు