బాస్కెట్‌బాల్‌ పోటీలకు ఎ.కోడూరు విద్యార్థి

23 Aug, 2016 23:43 IST|Sakshi
బాస్కెట్‌బాల్‌ పోటీలకు ఎ.కోడూరు విద్యార్థి
కె.కోటపాడు: రాష్ట్ర స్థాయి బాస్కెట్‌ బాల్‌ జట్టుకు ఎ.కోడూరు జెడ్పీ హైస్కూల్‌కు చెందిన విద్యార్థి యడ్ల ప్రసాద్‌ ఎంపికయ్యాడు. ఈనెల 21న విశాఖపట్నం ఆంధ్రాయూనివర్సిటీ గ్రౌండ్స్‌లో జరిగిన అండర్‌ 17 విభాగం రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుల ఎంపికలో ప్రసాద్‌ మంచి ప్రతిభ కనబర్చాడు. దీంతో  రాష్ట్రస్థాయి జట్టులో పాల్గొననున్నాడు.  ప్రసాద్‌ను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.అనురాధ, పీఈటీ కె.చిట్టిప్రసాద్, ఉపాధ్యాయులు మంగళవారం అభినందించారు.
మరిన్ని వార్తలు