350 ఏళ్లుగా దేవుడి ప్రసాదాన్ని చోరీ చేస్తున్న భక్తులు.. కారణమిదే!

18 Dec, 2023 12:08 IST|Sakshi

భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధిచెందిన దేవాలయాలు ఉన్నాయి. కొన్ని ఆలయాల్లో ఆచారాలు వింతగా ఉంటాయి. సాధారణంగా పుణ్యక్షేత్రాలు, ఆలయాలు సందర్శించినప్పుడు అక్కడ భక్తులకు తీర్థ, ప్రసాదాలు అందిస్తుంటారు. కానీ ఈ ఆలయంలో మాత్రం దేవుడి ప్రసాదాన్ని అక్కడి భక్తులు దొంగతనం చేయడం ఆనవాయితీగా వస్తుందట.

 ఆలయల్లో ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు,పూజలు అయ్యాక దేవుడికి నైవేద్యంగా సమర్పించిన అనంతరం భక్తులకు ప్రసాదాలు పంచుతారు. కానీ రాజస్థాన్‌లోని రాజసమంద్‌ని శ్రీనాథ్‌జీ ఆలయంలో మాత్రం దేవుడికి సమర్పించే ప్రసాదాన్ని గిరిజనులు లూటీ చేయడం ఆచారంగా వస్తోంది. దాదాపు 350 ఏళ్లుగా ఈ తంతు కొనసాగుతుంది. ప్రసాదాన్ని దొంగిలించడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు ఈ ఆలయానికి చేరుకుంటారు.

ఈ నైవేద్యాలను లూటీ చేసి తింటే సమస్త రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. స్వామివారి వద్ద నుంచి దొంగిలించే బియ్యాన్ని భక్తులు తమతమ ఇళ్లలో భద్రంగా దాచుకుంటారు. దీనివల్ల తమ కష్టాలు, దోషాలు తగ్గుతాయని విశ్వసిస్తారు. అందుకే ఇక్కడికి తండోపతండాలుగా భక్తులు వచ్చి పోతుంటారు. ఈ లూటీని ఎవరూ అడ్డుకోరు.

ఆదివాసీ భక్తులు ఇలా ప్రసాదాన్ని లూటీ చేయటమే శ్రీనాథ్‌జీ స్వామివారికి ఇష్టమట. ఇలా చేయకపోతే అన్నకూట్ మహోత్సవం పూర్తికాదని అంటారు. చాలా ఏళ్లుగా గిరిజనులు ఆలయం నుంచి ప్రసాదం లూటీ చేసి ఎత్తుకెళ్లడం ఆచారంగా వస్తోంది. ఈ ఏడాది కూడా ఇటీవలె మమోత్సవం జరగగ్గా అన్నకూటాన్ని కొల్లగొట్టే సంప్రదాయాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. 
 

>
మరిన్ని వార్తలు