‘అనంత’ను హరితవనంగా మారుస్తాం

2 Jul, 2017 00:02 IST|Sakshi

- ‘వనం- మనం’లో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్‌

ఆత్మకూరు (రాప్తాడు) :   పెద్ద ఎత్తున మొక్కలు నాటి ‘అనంత’ను హరితవనంగా మారుస్తామని రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం ఆత్మకూరు మండలంలోని పంపనూరు వద్ద ఏర్పాటు చేసిన సిటీ పార్కు వద్ద ‘వనం– మనం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులతో పాటు ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి , కలెక్టర్‌ వీరపాండియన్‌, ఎమ్మెల్యేలు హనుమంతరాయ చౌదరి, పార్థసారథి, పల్లె రఘునాథరెడ్డి హాజరయ్యారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ ప్రతి వ్యక్తీ ఒక మొక్క అయినా నాటి, వాటి సంరక్షణ చూసుకోవాలన్నారు. రాష్ట్రంలో 1.25 కోట్ల విద్యార్థులు ఉన్నారని ఒక్కొక్కరు ఒక్కో మొక్క నాటాలన్నారు. అనంతరం సిటీ పార్కు వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారులు చంద్రశేఖర్, శ్రీధర్‌, తహసీల్దార్‌ నాగరాజు, ఎంపీడీఓ ఆదినారాయణ, జెడ్పీటీసీ సభ్యుడు కుళ్లాయప్ప పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు