సూపరింటెండెంట్‌ పై చర్యలు తీసుకోండి

12 Dec, 2016 15:08 IST|Sakshi
సూపరింటెండెంట్‌ పై చర్యలు తీసుకోండి
ఈఓకు పురోహితుల ఫిర్యాదు ∙
చైర్మన్‌తో చర్చించిన తర్వాతేనని హామీ
అన్నవరం : అన్నవరం దేవస్థానంలో వ్రత పురోహితుల విషయంలో సూపరింటెండెంట్‌ కె. కొండలరావు  దురుసుగా ప్రవర్తించడంపై ఏర్పడిన వివాదం ఈఓ జోక్యంతో సద్దుమణిగింది. ఒక దశలో సూపరింటెండెంట్‌పై సత్వరం చర్య తీసుకోవాలని ఈఓ కార్యాలయం వద్ద నిరసన తెలపాలని పురోహితులు భావించారు. అయితే మధ్యాహ్నం ఈఓ నాగేశ్వరరావుతో సమావేశమైన తరువాత ఆయన సూపరింటెండెంట్‌పై చర్యలకు ఇచ్చిన హామీతో వివాదం సద్దుమణిగింది.  
వివరాలిలా ఉన్నాయి. భక్తుల నుంచి పురోహితులు ఏరకమైన దక్షిణలనైనా డిమాండ్‌ చేయరాదని, వారిస్తే తీసుకోవచ్చని ఈఓ నిబంధన విధించారు. దీనిపై అసంతృప్తిగా ఉన్న పురోహితులు గురువారం భక్తులు స్వచ్ఛందంగా  ఇచ్చిన కానుకలు కూడా హుండీలోనే వేసేసారు.
గురువారం ఉదయం వ్రతకధలో భాగంగా సత్యదేవుని ఆలయం త్రిమూర్త్యాత్మకం అనే విషయాన్ని ఓ భక్తుడు అడిగిన సందేహానికి పురోహితుడు వివరణ ఇస్తుండగా సూపరింటెండెంట్‌ కొండలరావు అతనిని బలవంతంగా జబ్బ పట్టుకుని మండపం నుంచి బయటకు లాగేశాడని సహ పురోహితులు తెలిపారు.  మిగిలిన నలుగురి పురోహితుల విషయంలో కూడా ఆయన ఇలాగే ప్రవర్తించాడని పురోహితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన విషయాన్ని  పురోహితులు ఈఓ నాగేశ్వరరావుకు ఫో¯ŒSలో వివరించి సూపరింటెండెంట్‌పై చర్యలకు డిమాండ్‌ చేశారు.   దీనిపై చర్చించేందుకు మధ్యాహ్నం ఒంటిగంటకు తన చాంబర్‌ కు రావాలని ఈఓ వారికి తెలిపారు. మధ్యాహ్నం ఈఓ ను కలిసిన పురోహితులు జరిగిన విషయాన్ని, అలాగే భక్తులు స్వయంగా ఇచ్చే కానుకలు తీసుకోవడానికి అనుమతించే విషయాన్ని వివరించారు. అలాగే తాము భక్తులను కానుకలు అడిగితే సస్పెండ్‌ చేయవచ్చునని ఈఓకి హామీ ఇచ్చారు.  దీనిపై ఈఓ సానుకూలంగా స్పందించారు. అలాగే సూపరిండెంట్‌ విషయాన్ని కార్తికమాసం తరువాత ఆలయ చైర్మన్‌ రోహిత్‌తో చర్చించి నిర్ణయిస్తామని ఈఓ తెలిపారు.    ఈఓ కె.నాగేశ్వరరావును కలిసిన పురోహితుల ఫైవ్‌మె¯ŒS కమిటీ సభ్యులు స్పెషల్‌గ్రేడ్‌ పురోహితుడు  నాగాభట్ల కామేశ్వరశర్మ, కర్రి వైకుంఠరావు,  బండి నర్శింహమూర్తి, చామర్తి కన్నబాబు, కర్రి సూర్యనారాయణ మూర్తి, స్పెషల్‌గ్రేడ్‌ పురోహితుడు ముత్య సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
 
 
మరిన్ని వార్తలు