ఆటోమేటిక్‌ దంతితో లాభాలు

26 Jul, 2016 00:53 IST|Sakshi

పుట్టపర్తి అర్బన్‌ : ఖరీప్‌ సీజన్‌లో సాగుచేసిన వివిధ పంటల్లో కలుపు తొలగించడానికి వినియోగించే ఆటోమేటిక్‌ దంతి (కలుపు తీసే పనిముట్టు) తో లాభాలు ఉన్నాయని రైతులు పేర్కొంటున్నారు. సుమారు వెయ్యి రూపాయల ఖర్చుతో సైకిల్‌ చక్రంతో తయారు చేసిన దంతితో ఖర్చు లేకుండా కలుపు తొలగించవచ్చని గంగిరెడ్డిపల్లి రైతు కుళ్లాయప్ప చెప్పారు. ఒక యంత్రంతో ఒక మనిషి అలుపు లేకుండా రోజుకు ఎకరా పైన కలుపు తీయవచ్చన్నారు. ప్రస్తుతం వేరుశనగ, కంది,పంటల్లో  కలుపు తీయడానికి ఎద్దులు దొరకడం కష్టంగా ఉండడం, కూలీలు దొరకక పోవడంతో కలుపు తొలగించే యంత్రాన్ని తయారు చేయించినట్లు ఆయన చెప్పారు.  

 

>
మరిన్ని వార్తలు