జాతీయస్థాయి బాస్కెట్‌బాల్‌ టోర్నీకి జిల్లా జట్లు

17 Nov, 2016 22:29 IST|Sakshi
 
ముమ్మిడివరం :
బాస్కెట్‌బాల్‌ నేషనల్‌ టోర్నమెంట్‌కు బా లురు, బాలికలను ఎంపిక చేసినట్లు ఏపీ రాష్ట్ర బాస్కెట్‌ బా ల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చెంకల రామనాయుడు, ఇన్‌చార్జి కార్యదర్శి చక్రవర్తి, జాతీయ క్రీడా కారుడు నడిం పల్లి అప్పలరాజు తెలిపారు.  ఈ జట్లు కర్నాటక రాష్ట్రం హాసన్‌లో ఈనెల 19 నుంచి జరి గే జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్రం తరఫున ఆడతాయన్నా రు. ఆ పోటీల్లో ప్రతిభ కనపరిచినవారు  దేశం తరఫున ఆడతారన్నారు. శిక్షణ పొందిన క్రీడాకారులకు ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు స్పోర్ట్స్‌ కిట్లు అందజేశారు. జట్లకు ఎంపికయిన విద్యార్థులు గురువారం హాసన్‌ బయలుదేరారు.
బాలికల జట్టు :
ఎస్‌కే చాందిని(గుంటూరు), ఎం.ఈశ్తర్‌ రాణి(గుంటూరు), సీఎస్‌ఎస్‌ సుస్మిత, ఎ.జాస్మిన్‌ (తూర్పుగోదావరి), ఆర్‌.శ్వేత, వి.సాత్విక (కృష్ణా), బి.ప్రమీల(అనంతపురం), డి.నెహ్రామృత(విశాఖ), కె.హిమబిందు(కర్నూలు), సి.శ్వేతామాధురి(పశ్చిమగోదావరి), జి.అఖిల(చిత్తూరు), పి.ఉమామహేశ్వరి(గుంటూరు), ఎన్‌.పద్మావతి(అనంతపురం).
బాలుర జట్టు :
వి.నాగదుర్గా ప్రసాద్, ఎ.సాయిపవన్‌ కుమార్, ఎస్‌వీవీ సాయి కృష్ణ, ఎన్‌.రవితేజ, ఎం.మణికం ఠ, కె.అవినాష్, (తూర్పుగోదావరి), వి.సాయిగణేష్, ఎస్‌.సచిన్‌ (విశాఖ), వై.సాయికృష్, పి.భాస్కర్‌ (గుంటూరు), ఎ.సాయికుమార్‌(అనంతపురం), ఎం.విశాల్‌(చిత్తూరు), కె.కె.రెడ్డి(పశ్చిమగోదావరి), జె.ఆకాష్‌(కృష్ణా).
 
ఫుట్‌బాల్‌ టోర్నీలో జిల్లాకు రెండోస్థానం  
భానుగుడి(కాకినాడ) :
చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఈ నెల 10నుంచి 15వరకు నిర్వహించిన జసిద్దిన్‌ మెమోరియల్‌ సౌత్‌ ఇండియా ఫుట్‌బాల్‌ ఇన్విటేషన్‌ టోర్నమెం ట్‌లో జిల్లాజట్టు రెండోస్థానం సాధించినట్లు క్రీడాభివృద్ధి అధికారి పి.మురళీధర్‌ గురువారం ఓ ప్రకటనలో తెలి పారు. జట్టు తలపడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలుపొం ది ఫైనల్‌కు చేరిందని, ఫైనల్‌లో స్పోట్స అథారిటీ ఆఫ్‌ ఇండియా కర్నూల్‌ జట్టుతో పోటీపడి పెనాల్టీ షూటౌట్‌ లో 03–04 స్కోరుతో రెండవ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. క్రీడాకారులను, శిక్షకులను అభినందించారు.
 
 
మరిన్ని వార్తలు