ట్రంప్ విజయంపై పాఠాలు | Sakshi
Sakshi News home page

ట్రంప్ విజయంపై పాఠాలు

Published Thu, Nov 17 2016 10:26 PM

ట్రంప్ విజయంపై పాఠాలు - Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో: అమెరికా పబ్లిక్ స్కూల్లో ట్రంప్‌పై విద్యార్థులకు తరగతి పాఠాలు చెప్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జాత్యాంహకార, లైంగిక ఆరోపణలు ఎదుర్కొని దేశాధ్యక్షుడుగా ఎలా గెలిచాడో విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు. సిటీ టీచర్ యూనియన్ ఇందుకు సంబంధించిన ప్రణాళికను అమలు చేయాలని అన్ని పాఠాశాలలకు మొరుుల్ చేసింది. పాఠశాల ఇష్టానుసారంగానే ఇది అమలు చేయవచ్చని, తప్పనిసరిగా అమలుకు ఎలాంటి ఆదేశాలు లేవని విద్యాశాఖాధికారి జెంటిల్ బ్లైత్ అన్నారు.

ఇందుకోసం కాలిఫోర్నియా స్టాండర్డ్స్‌కు అనుగుణంగా పాఠాలు తయారుచేయనున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కో ప్రజలు, టీచర్లు ఇందుకు సహకరిస్తున్నారని బ్లైత్ అన్నారు. ఇది ట్రంప్‌కు ప్రచారం చేసే కార్యక్రమం, కాదని కేవలం విజేత గురించి విద్యార్థులకు బోధించడం మాత్రమే అవుతుందని ఆర్‌ఎన్‌సీ కమిటీకి చెందిన హమ్రీత్ దిల్లాన్ అన్నారు. అమెరికా అధ్యక్ష ఫలితాలు వెలువడిన కొద్దిసేపటికే  సోషల్ టీచర్ అరుున ఫక్రాషా.. ట్రంప్ విజేత ఎలా అయ్యాడని పాఠాలు రాశారు.

Advertisement
Advertisement