పరిశోధనారంగంలో విస్తృత అవకాశాలు

12 Dec, 2016 14:27 IST|Sakshi
పరిశోధనారంగంలో విస్తృత అవకాశాలు

 కర్నూలు సిటీ: శాస్త్రీయ పరిశోధన రంగం వైపు యువత రావాల్సిన అవసరం ఉందని, ఈ రంగంలో విస్త్రృతమై అవకాశాలు ఉన్నాయని పలువురు ప్రొఫెసర్లు అన్నారు. క్యాన్సర్‌ బయాలజీ అనే అంశంపై స్థానిక సిల్వర్‌జూబ్లీ కాలేజీలో నిర్వహించిన రెండు రోజుల జాతీయ సెమినార్‌ శనివారంతో ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి ప్రొఫెసర్‌ డా.హరీష్, అన్నామలై యూనివర్శిటీ ప్రొఫెసర్‌ నాగిని, ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ప్రొఫెసర్‌ రాజేశ్వరిలు ముఖ్య అతి«ధులుగా హాజరై ప్రసంగించారు. దేశ భవిష్యత్తు, అబివృద్ధి అనేది శాస్త్ర పరిశోధన రంగంపై ఆధార పడి ఉంటుందన్నారు. రోజు రోజుకు కొత్త కొత్త విషయాలను తెలుసుకునేందుకు పరిశోధనరంగం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అధిక శాతం మంది యువత క్యాన్సర్‌ బారిన పడుతున్నారని, ఆహారపు అలవాట్లు  కాలానుగణంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. క్యాన్సర్‌పై దేశంలో పరిశోధనలు పెద్ద ఎత్తున చేస్తున్నారని తెలిపారు. అనంతరం ఆ కాలేజీ పూర్వ విద్యార్తి శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌డాక్టర్‌ అబ్దుల్‌ ఖాదర్, వైస్‌ ప్రిన్సిపాల్‌ సునీత, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి  జాన్సన్‌ సాటురస్, కన్వీనర్‌  మైఖెల్‌ డేవిడ్,  లలితా కూమారి, మాధవీలత, లక్ష్మీరంగయ్య తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు