దేశ ప్రయోజనాల కోసమే పెద్ద నోట్ల రద్దు

11 Dec, 2016 00:01 IST|Sakshi
  • బీజేపీ సమన్వయకర్త రఘురామ్‌
  • మామిడికుదురు : 
    దేశ ప్రయోజనాల కోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని బీజేపీ రాష్ట్ర సమన్వయకర్త పురిఘళ్ల రఘురామ్‌ పేర్కొన్నారు. ‘నల్ల ధనం నిర్మూలన–దేశ ప్రయోజనాలు’ అనే అంశంపై శనివారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు భవిష్యత్తులో ప్రజలకు ఎంతో మేలు చేస్తుందన్నారు.  మోదీ తీసుకున్న నిర్ణయాన్ని మెజార్టీ ప్రజలు స్వాగతిస్తుండగా స్వార్థపరులు వ్యతిరేకిస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం బంగారం జోలికి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. నోట్ల రద్దు నిర్ణయం తరువాత కొనుగోలు చేసిన బంగారం లెక్కలు మాత్రమే సేకరిస్తోందన్నారు. నగదు రహిత సేవలతో కలిగే ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పార్టీ నాయకులు పాలూరి సత్యానందం, మెండా ఆదినారాయణ, చెరుకూరి గోపాలకృష్ణ, రావూరి సుధ, కొల్లు సూర్యారావు, గాడి సత్తిబాబు, నక్కా త్రిలోచనరావు తదితరులు పాల్గొన్నారు.    
     
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

సినిమా

చేతులెత్తి నమస్కరిస్తున్నా : బాలకృష్ణ

ప్ర‌ధానిని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తిన రంగోలీ

బిగుతు దుస్తులు వ‌ద్ద‌న్నారు: ప‌్రియాంక‌

కరోనా : బాలయ్య విరాళం : చిరు ట్వీట్‌

విడాకులకు సిద్దంగానే ఉన్నావా అని అడిగారు..

సీసీసీకి టాలీవుడ్‌ డైరెక్టర్‌ విరాళం..