తమ్ముడిని కోసం ప్రాణం ఇచ్చిన అన్న

10 Jun, 2017 23:25 IST|Sakshi
తమ్ముడిని కోసం ప్రాణం ఇచ్చిన అన్న
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనులలో అపశృతి
గోదావరిలో మునిగి జార్ఖండ్‌వాసి మృతి
 
సీతానగరం (రాజానగరం) : ఆస్తుల కోసం కొట్టుకు చస్తున్న అన్నదమ్ములు ఉన్న ఈ రోజులలో తమ్ముడి కోసం తన ప్రాణాన్నే అర్పించాడు ఓ అన్న. రక్తం సంబంధం విలువేంటో నిరూపించాడు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనులకు జార్ఖండ్‌ రాష్ట్రం తలామూరు జిల్లా శంఖ గ్రామం నుంచి అన్నదమ్ములు  విజయ్‌కుమార్‌ గుప్త (35), చిత్తరంజన్‌ కుమార్‌ గుప్తలు క్రేన్‌ (ఎక్షావేటర్‌) ఆపరేటర్లుగా వచ్చారు. శనివారం మధ్యాహ్న 12 గంటలకు పని పూర్తి అయిన తరువాత ఎదురుగా ఉన్న గోదావరిలో స్నానానికి వెళ్లారు. ఇసుక తవ్వకాలకు సిమెంట్‌ తూరలు ఏర్పాటు చేసి రోడ్డు వేశారు. రోడ్డులో రెండో తూర వద్ద స్నానాకి దిగిన తమ్ముడు చిత్తరంజన్‌ కుమార్‌ గుప్త ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగిపోతుంటే అది గమనించిన అన్న విజయ్‌ కుమార్‌ గుప్త తమ్ముడి చేతులు పట్టుకుని ఒడ్డుకు లాగి తమ్ముడి ప్రాణాలు కాపాడాడు. అదే సమయంలో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో తమ్ముడిని రక్షించి బేలన్స్‌ తప్పి ఆదే గోతిలోకి అన్న విజయ్‌కుమార్‌ గుప్త (35) ప్రమాదవశాత్తు మునిగి ప్రాణాలు ఒదిలాడు. మృతునికి భార్య ప్రమీలాదేవి, పదేళ్ల కుష్బు కుమారి, నాలుగేళ్ల అభిమన్యు కుమారి, ఏడేళ్ల కుమారుడు మల్లేష్‌కుమార్‌ గుప్త ఉన్నారు. సమాచారం అందుకున్న ఎస్సై ఎ.వెంకటేశ్వరావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతోను, గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం 6 గంటలకు మృతదేహం లభ్యం కాలేదు
మరిన్ని వార్తలు