నేటి నుంచి ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లు | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లు

Published Sat, Jun 10 2017 11:22 PM

నేటి నుంచి ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లు - Sakshi

జేఎన్‌టీయూ : ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌లో భాగంగా ఈ నెల 8 వ తేదీ ప్రారంభమైన  సర్టిఫికెట్ల పరిశీనల కొనసాగుతోంది. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, అనంతపురం, ఎస్కేయూలోని హెల్ప్‌లైన్‌ సెంటర్లలో శనివారం 453 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి అయింది. ఆదివారం నుంచి వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.

వెబ్‌ ఆప్షన్లుకు నిర్దేశించిన తేదీలు, ర్యాంకుల వివరాలు ..
 11, 12 తేదీల్లో 1 నుంచి 30 వేల ర్యాంకు దాకా, 13,14 తేదీల్లో 30,001 నుంచి 60 వేలు, 15, 16 తేదీల్లో 60,001 నుంచి 90 వేలు, 17, 18 తేదీల్లో 90,001 నుంచి 1,20,000 ర్యాంకు వరకు, 19, 20 తేదీల్లో 1,20,001 నుంచి చివరి ర్యాంకు వరకు, 21, 22 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు మార్చుకోవడానికి వెసులుబాటు కల్పించారు. 25న సీట్లు కేటాయిస్తారు. www.apeamcet.nic.in అనే వెబ్‌సైట్‌ ద్వారా లాగిన్‌ అవ్వాలి.

వెబ్‌ ఆప్షన్ల ఎంట్రీ ఇలా..
– క్లిక్‌ హియర్‌ ఫర్‌ ఆప్షన్స్‌ ఎంట్రీ బటన్‌పై క్లిక్‌ చేశాక.. డిస్‌ప్లే ఆప్షన్‌ ఎంట్రీ ఫామ్‌ అని మరో బాక్స్‌ కనిపిస్తుంది.
– వీటిపై క్లిక్‌ చేస్తే. అభ్యర్థులు ఎంపిక చేసుకోబోయే  రీజియన్‌ పరిధిలో ఎంపిక చేసుకొన్న కళాశాలలు, కోడ్‌లు , బ్రాంచ్‌లు, జిల్లాలతో కూడిన ఆప్షన్స్‌ ఎంట్రీ ఫామ్‌ ఎంపిక అవుతుంది. ఇందులో ముందుగా ఎంసెట్‌ హాల్‌టికెట్‌ కాలమ్‌లో ఎంసెట్‌ హాల్‌టికెట్‌ నంబరును పొందుపర్చాలి. తర్వాత.. విద్యార్థులు తమకు నచ్చిన ప్రాథమ్యం ఆధారంగా ఆయా కళాశాల కోడ్‌ల పక్కన , బ్రాంచ్‌ కోడ్‌ల కింద కనిపించే బాక్స్‌ల్లో  ప్రాధాన్యత సంఖ్యను పొందుపరచాలి.
– ఉదాహరణకు జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్‌ కళాశాలలో సీఎస్‌ఈ బ్రాంచ్‌ను తొలి ప్రాథామ్యంగా నిర్ణయించాలనుకొంటే .. ఆప్షన్స్‌ ఎంట్రీ విండ్‌లో కళాశాల కోడ్‌ కింద కనిపించే jntucea కోడ్‌ పక్కన కనిపించే సీఎస్‌ఈ బ్రాంచ్‌ కోడ్‌ బాక్స్‌లో 1వ అంకెను పొందుపర్చాలి.
– ఇదే విధంగా సంబంధిత కలాశాల కొడ్‌ పక్కన కనిపించే బ్రాంచ్‌ కోడ్‌ పక్కన తమ ప్రాథమ్యత సంఖ్యను పేర్కొంటూ ఆప్షన్స్‌ ఎంట్రీ పూర్తి చేయవచ్చు.
– ఆప్షన్స్‌ ఎంట్రీ పరంగా ఎలాంటి గరిష్ట పరిమితి లేదు.
– అభ్యర్థి ఎన్ని ఆప్షన్లు అయినా పేర్కొనొచ్చు.
– ఆప్షన్స్‌ ఎంట్రీ పూర్తి అయ్యాక వ్యూ అండ్‌ ప్రింట్‌ బటన్‌పై క్లిక్‌ చేస్తే అప్పటి వరకు విద్యార్థి ఎంటర్‌ చేసిన ఆప్షన్ల వివరాలతో సహా ఫైల్‌ కనిపిస్తుంది. దీన్ని ప్రింట్‌ తీసుకొని తమ వద్దే ఉంచుకోవాలి.

ఆప్షన్ల ఎంట్రీ తరువాత :
        ఆప్షన్స్‌ ఎంట్రీ ప్రక్రియ మొత్తం పూర్తి అయిన తరువాత పూర్తి అయిందని విద్యార్థి భావిస్తే logout బటన్‌పై క్లిక్‌ చేస్తే ...save and logout బటన్‌పై క్లిక్‌ చేస్తే.. విద్యార్థులు ఇచ్చిన ఆప్షన్ల వివరాల విండో ఓపెన్‌ అవుతుంది. వీటిని సరిచూసుకున్నాక ఎలాంటి మార్పులు లేవనుకుంటే confirm logout బటన్‌పై క్లిక్‌ చేయాలి.

Advertisement
Advertisement