వికలాంగులకు బస్‌పాసు కౌంటర్‌

25 Jul, 2016 16:52 IST|Sakshi
వికలాంగులకు బస్‌పాసు కౌంటర్‌

బస్‌పాసుల అందజేసిన డీఎం హేమంత్‌రావు
ఇబ్రహీంపట్నం : వికలాంగులకు బస్‌పాసు కౌంటర్‌ను స్థానిక డీపో మేనేజర్‌ హేమంత్‌రావు సోమవారం ప్రారంభించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రతి నెల 25, 26 తేదీలల్లో వికలాంగులకు బస్‌పాసులను ఇవ్వానున్నట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం బస్‌స్టాండ్‌లో బస్‌పాస్ కౌంటర్‌ను ఏర్పాటు చేసామని ఈ ఆవకాశాన్ని వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం విహెచ్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు కాళ్ల జంగయ్య మాట్లాడుతూ వికలాంగుల సిటీ బస్సుపాసులను ఇబ్రహీంపట్నంలో తీసుకునేవిధంగా ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసేందుకు సహకరించిన మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, డీఎం హేమంత్‌రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు వీరన్న, బీ. చంద్రశేఖర్‌, విహెచ్‌పీఎస్‌ నాయకులు శ్రీనివాస్‌, రమేష్‌లు పాల్గొన్నారు.  ఈ సందర్బంగా వికలాంగులకు డీఎం చేతుల మీదుగా బస్‌పాసులను అందజేశారు.

మరిన్ని వార్తలు