మేయర్‌ దంపతులపై కేసు

20 Jul, 2016 23:35 IST|Sakshi
అనంతపురం న్యూసిటీ : నగరపాలక సంస్థ మేయర్‌ మదమంచి స్వరూప, ఆమె భర్త మదమంచి వెంకటేశ్‌పై కోర్టులో కేసు నమోదైంది. నేడో రేపో అడిషినల్‌ జుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌క్లాస్‌ సమన్లు జారీ చేయనుంది. అడిషినల్‌ జుడీషియల్‌ కోర్టులో నమోదు చేసిన సీఎఫ్‌ 2280 కేసులో ఏముందంటే...‘టీడీపీ నేత జయరాం నామయుడు అతని డ్రైవర్‌ మిద్దె రాజశేఖర్‌ ఈ నెల 18న మేయర్‌ ఇంటికి వెళ్లారు.
 
మునిసిపల్‌ ఎన్నికల్లో పార్టీ గెలవడానికి డ్రైవర్‌ రాజశేఖర్‌ కృషి చేశాడని, అతనికి కాంట్రాక్టు పోస్టు వచ్చేలా చూడాలని మేయర్‌కు విన్నవించారు. ఇందుకు ఎన్నికల్లో నీవు మమ్మల్ని గెలిపించావా..? అంటూ మేయర్‌ కులం పేరుతో దూషించారు. అలాగే మేయర్‌ భర్త వెంకటేష్‌ దాడికి యత్నించారు. అడ్డుకోబోయిన జయరాం నాయుడుపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో మేయర్‌ స్వరూపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, మేయర్‌ భర్త వెంకటేశ్‌పై హత్యాయత్నం కింద కేసు నమోదైంది’. 
 
ఆస్పత్రిలో చికిత్స 
ఈ నెల 18న టీడీపీ నేత జయరాం నాయుడు, ఆయన డ్రైవర్‌ మిద్దె రాజశేఖర్‌ సర్వజనాస్పత్రిలోని ఎంఎస్‌ –1లో అడ్మిట్‌ అయ్యారు. దీనిపై పోలీసులు స్పందించలేదు. మేయర్, ఆమె భర్తపై కేసు నమోదు చేయాలని బాధితులు పోలీసులను కోరారు. వారు స్పందించకపోవడంతో మిద్దె రాజశేఖర్, టీడీపీ నేత జయరాం నాయుడు కోర్టునాశ్రయించారు. మేయర్‌పై కేసు నమోదు కావడం పెద్ద చర్చనీయాంశమైంది.  
 
మరిన్ని వార్తలు