అలరించిన ‘నెలనెలా వెన్నెల’

29 Aug, 2016 00:06 IST|Sakshi
భజంత్రీలు నాటిక
  •  కాలం విలువ తెలిపిన ‘బాధ్యత’
  •  కడుపుబ్బ నవ్వించిన ‘భజంత్రీలు’
  •  ఆకట్టుకున్న కిలారు అనన్య నృత్య ప్రదర్శన
  •  
    ఖమ్మం కల్చరల్‌: నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో అన్నాబత్తుల రవీంధ్రనాథ్‌ కళాసాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రెండు నాటికలు  ‘బాధ్యత’, ‘భజంత్రీలు’ ప్రదర్శితమయ్యాయి. ప్రతి నెల నిర్వహిస్తున్న నెలనెలా వెన్నెల 15వ నెల కార్యక్రమమిది. అనే రెండు నాటికలు, స్థానిక కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు నగరవాసులను అలరించాయి.  ప్రారంభ కార్యక్రమంలో అన్నాబత్తుల రవీంధ్రనాథ్‌ చిత్రపటానికి నిర్వాహకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథులుగా ట్రాఫిక్‌ స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ పింగళి నరేష్‌రెడ్డి, భద్రాద్రి బ్యాంక్‌ డైరెక్టర్‌ వేములపల్లి వెంకటేశ్వరరావు, పులిపాటి కళాశాలల చైర్మన్‌ పులిపాటి ప్రసాద్, సాహితి విద్యాసంస్థల ఛైర్మన్‌ జమ్ముల రాఘవరావు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. గత పదిహేను నెలలుగా నగర వాసుల అభిమానాన్ని చూరగొంటూ ముందుకు సాగుతున్న నెలనెలా కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు. నగరానికి చెందిన కిలారు అనన్య ప్రదర్శించిన∙కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. అన్నాబత్తుల రవీంధ్రనాథ్‌ కళాసాంస్కృతిక సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు మోటమర్రి జగన్‌మెహన్‌రావు, అన్నాబత్తుల సుబ్రహ్మణ్యకుమార్, ఖమ్మం కళాపరిషత్‌ అధ్యక్ష, కార్యదర్శులు వివి.అప్పారావు, నాగబత్తిని రవి తదితరులు పాల్గొన్నారు.
    • అందరూ ‘బాధ్యత’గా ఉండాలి
    నేటి సమాజంలోని అనేకమందిలో మానవత్వం మాయమవుతోంది. మానవ సంబంధాలు మృగ్యమవుతున్నాయి. వృద్ధులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ వృద్ధాప్యం వస్తుంది. అది అనివార్యం. ఈనాడు వృద్ధులను పట్టించుకోని వారికి, వారికి వృద్ధాప్య దశలో అదే అనుభవం ఎదురవుతుంది. అందుకే, అందరూ ‘బాధ్యత’గా ఉండాలి. – ఇదీ, ఈ నాటిక వృత్తాంతం.
    • కడుపుబ్బ నవ్వించిన ‘భజంత్రీలు’S
    అతని పేరు గండభేరుండ. జమీందారు. పరమ పిసినారి కూడా. అతని కుమారుడు జ్యోతి. ఇతడు (జ్యోతి) తన స్నేహితుడైన రామం చెల్లెలిని ఇష్టపడతాడు. ఆమెను విహహం చేసుకుంటానని తండ్రితో చెబుతాడు. ఆస్తిపాస్తులు లేని ఆ అమ్మాయితో జ్యోతి వివాహానికి ఆ తండ్రి అంగీకరించడు. నౌకరు చవలయ్యతో కలిసి జ్యోతి నాటకమాడి, తండ్రిని ఒప్పించి, ఆ అమ్మాయిని వివాహమాడతాడు. ఇదీ ‘భజంత్రీలు’ నాటిక ఇతివృత్తం. ఈ హాస్య నాటిక ఆద్యంతం ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది.
     
     
మరిన్ని వార్తలు