సిక్సర్లతో చెలరేగిన చిరంజీవి

15 Feb, 2017 22:50 IST|Sakshi
సిక్సర్లతో చెలరేగిన చిరంజీవి

ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని స్టేడియంలో జరుగుతున్న టీ–20 మ్యాచ్‌లో ఎంపీఈడీ విభాగం సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఉదయం జరిగిన మ్యాచ్‌లో ఎంపీఈడీ, ఫార్మసీ విభాగాల జట్ల మధ్య జరిగింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎంపీఈడీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 230 పరుగులు సాధించింది. ఎంపీఈడీ జట్టు కెప్టెన్‌ చిరంజీవి 38 బంతుల్లో ( 12 సిక్సర్లు, 3 ఫోర్‌లు ) 108 పరుగులు చేయడంతో భారీ స్కోర్‌ లక్ష్యాన్ని సాధించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఫార్మసీ జట్టు 13.4 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌట్‌ కావడంతో ఎంపీఈడీ జట్టు ఫైనల్‌కు చేరింది. సెంచరీ సాధించిన ఎం. చిరంజీవికి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును కంప్యూటర్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ భాస్కర్‌ రెడ్డి అందించారు.

              మధ్యాహ్నం ఎంబీఏ, బీఈడీ కళాశాల జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌ను వర్సిటీ పాలకమండలి సభ్యులు ఆచార్య ఏ.మల్లిఖార్జునరెడ్డి ప్రారంభించారు. ఎంబీఏ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన బీఈడీ జట్టు లక్ష్యాన్ని సాధించలేక ఆలౌట్‌ అయ్యారు. కార్యక్రమంలో ఎంపీఈడీ విభాగం ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ ఎంవీ శ్రీనివాసన్, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ డాక్టర్‌ కిరణ్‌ చక్రవర్తి, శివ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు