అమ్మో... నారాయణ!

28 Mar, 2017 02:38 IST|Sakshi
అమ్మో... నారాయణ!

నారాయణ విద్యా సంస్థల్లో వరుస దుర్ఘటనలు!
క్రమ‘శిక్ష’ణలో రాలిపోతున్న విద్యాకుసుమాలు
తాజాగా కడప విద్యార్థి ఆత్మహత్యాయత్నం
లోపాలు సరిదిద్దుకోని యాజమాన్యం


తిరుపతి రూరల్‌: మంత్రి నారాయణకు చెందిన విద్యాసంస్థల్లో వరుస దుర్ఘ్గటనలు కలవరపరస్తున్నాయి. క్లాస్‌కు ఆలస్యంగా వస్తున్నాడని....హోంవర్క్‌ సరిగా చేయలేదని, మార్కులు తక్కువగా వచ్చాయని, ఫీజులు సకాలంలో చెల్లించడం లేదని ..ఇలా వివిధ కారణాలతో వేధింపులెదురవుతున్నాయి. విద్యార్థులు తీవ్ర మానసిక వేదనతో నలిగిపోతున్నారనే ఆరోపణలున్నా యి.  ఒత్తిడి..అవమానం భరించలేని కొందరు విద్యార్థులు బడి భవనాలపై నుంచే దూకేస్తూ ప్రాణాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతున్నారు. ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలే ఈ విషయాన్ని రుజువుచేస్తున్నాయి. కపీలతీర్థం వద్ద ఉన్న విద్యా సంస్థలో ఆలస్యంగా వచ్చాడని ఉపాధ్యాయుడు తిట్టడంతో ఓ విద్యార్థి ఇటీవల నాలుగు అంతస్తుల స్కూల్‌ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

స్టడీ అవర్‌లో మార్కులు సరిగా రాలేదని వైస్‌ ప్రిన్సిపాల్‌ తిట్టడంతో కాలూరు క్రాస్‌లోని విద్యా సంస్థలో ఈనెల 14వ తేదీన అనంతపురానికి చెందిన సాయిచరణ్‌నాయక్‌ రెండు అంతస్తుల స్కూల్‌ భవనం పైనుంచి దూకి చనిపోయాడు. తాజాగా పరీక్ష సరిగా రాయలేదని మనస్థాపంతో కాలూరు క్రాస్‌లోని విద్యాసంస్థ భవనంపై నుంచి వైఎస్‌ఆర్‌ జిల్లా సంబేపల్లికి చెందిన వాసుదేవరెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కార్పొరేట్‌ కాసుల దాహానికి వీరంతా బలైపోతున్నారు. బిడ్డలను ఉన్నత చదువులను చదివించుకుందామన్న పేద, మధ్య తరగతి తల్లిదండ్రుల ఆశల్ని మొగ్గలోనే చిదిమేస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడం దారుణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల సంక్షేమం విస్మరించి కాసులే ధ్యేయంగా నడుపుతున్న నారాయణ విద్యా సంస్థలను మూసివేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇప్పటికే కరపత్రాలను పంపిణీ చేశాయి.

http://img.sakshi.net/images/cms/2017-03/41490649783_Unknown.jpgతిరుపతి నారాయణ స్కూల్‌లో మొదటి అంతస్తు  నుంచి దూకి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న పదోతరగతి విద్యార్థి వాసుదేవ రెడ్డి

మరిన్ని వార్తలు