కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని రద్దు చేయాలి

11 Aug, 2016 22:54 IST|Sakshi
మాట్లాడుతున్న వెన్నపూస గోపాల్‌రెడ్డి
 ఎపీఎన్‌జిఓ మాజీ అధ్యక్షుడు వెన్నపూస గోపాల్‌రెడ్డి
గుంతకల్లు టౌన్‌:
ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమును రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని ఏపీ ఎన్‌జీఓ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, పశ్చిమ రాయలసీమ నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గుంతకల్లు, గుత్తి పట్టణాల్లో గురువారం ఆయన పర్యటించారు. కళాశాలలు, స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న అధ్యాపక, ఉపాధ్యాయులు, ఉద్యోగ, కార్మిక సిబ్బందిని కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు.
 
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీపీఎస్‌ విధానం వల్ల ప్రభుత్వ ఉద్యోగి, వారి కుటుంబ సభ్యులకు సామాజిక భద్రత లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.  డీఏ బకాయిలను చెల్లించాలని, పీఆర్‌సీ అనుబంధ జీఓలను అమలు చేయాలన్నారు. హెల్త్‌కార్డు సౌకర్యం ఉన్న ఉద్యోగ, కార్మికులందరికీ క్యాస్‌లెస్‌  కార్పొరేట్‌ వైద్యం అందజేయాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్‌ లెక్చరర్లు, ఉపాధ్యాయులను రెగ్యులరైజ్‌ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.  
 
రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక నిరుద్యోగ ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్‌ అశోక్‌కుమార్‌ రెడ్డి, జిల్లా కన్వీనర్‌ ఓబులరావు, రిటైర్డ్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ నేతలు ఆయన వెంట ఉన్నారు.
మరిన్ని వార్తలు