గుంతలమయంగా గట్టికల్లు రోడ్డు

27 Jul, 2016 01:25 IST|Sakshi
గుంతలమయంగా గట్టికల్లు రోడ్డు
ఆత్మకూర్‌(ఎస్‌) : మండలంలోని గట్టికల్లు రోడ్డు అడుగడుగునా గుంతలమయంగా మారింది. దీంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మండల పరిధిలోని నెమ్మికల్లు–దంతాలపల్లి ఎక్స్‌ రోడ్డు నుంచి గట్టికల్లు వరకూ 2.5 కిలోమీటర్ల రోడ్డు ఉంది. దీనికి ఐదేళ్ల క్రితం రూ.18 లక్షల వ్యయంతో బీటీ వేశారు. ఈ రోడ్డు మీదుగా నిత్యం గట్టికల్లు, పీపానాయక్‌తండా, సోమ్లాతండాకు చెందిన ఆటోలు, ఇతర వాహనాలు వెళ్తుంటాయి. అయితే బీటీ వేసిన కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో  పలుచోట్ల గుంతలు ఏర్పడ్డాయి. అయినా రోడ్డుపై ఎలాంటి మరమ్మతులు చేయకపోవడంతో గుంతలతో ప్రయాణికులు నరకం చూస్తున్నారు. గుంతలమయంగా ఉన్న ఈ రోడ్డుపై ఆటోలో వెళ్లాలంటే బాలింతలు, గర్భవతులు, వద్ధుల బాధలు చెప్పతరం కావడం లేదు. గుంతల మూలంగా బైక్‌లపై వెళ్లేవారు రాత్రివేళ్లల్లో ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతలమయంగా మారిని గట్టికల్లు రోడ్డును మరమ్మతులు చేయించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
 
మరిన్ని వార్తలు