బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలి

29 Aug, 2016 22:25 IST|Sakshi
బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలి
  • లండన్‌లో డెప్యూటీ సీఎం మహమూద్‌ అలీ
  •  రాయికల్‌ : బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్‌ఆర్‌ఐలు భాగస్వాములు కావాలని డెప్యూటీ సీఎం మహమూద్‌ అలీ అన్నారు. లండన్‌లో సోమవారం ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్‌సెల్, యూకే, హైదరాబాద్‌ అసోసియేషన్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం పలు రకాల రాయితీలు ఇస్తోందన్నారు. గల్ఫ్‌ దేశాల్లోని కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మంత్రి కేటీఆర్‌ ఎన్‌ఆర్‌ఐ పాలసీపై కసరత్తు చేస్తున్నారని తెలిపారు. సందేహాలు, సలహాలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం వివిధ సంఘాల ప్రతినిధులు డెప్యూటీ సీఎంను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్‌ సెల్‌ అధ్యక్షుడు కూర్మాచలం అనిల్, సెక్రటరీలు నవీన్‌రెడ్డి, దొంతుల వెంకట్‌రెడ్డి, యూకే ఇన్‌చార్జి విక్రమ్‌రెడ్డి, శ్రీధర్‌రావు, లండన్‌ ఇన్‌చార్జి రత్నాకర్‌రావు, మధుసూదన్‌రెడ్డి, హైదరాబా«ద్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ముజీద్, ఉపాధ్యక్షుడు నవాజ్, ప్రధాన కార్యదర్శి షమి, టీడీఎఫ్‌ అధ్యక్షుడు రామారావు, జేపీఆర్‌డీసీ అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, టీఈఎన్‌ఎఫ్‌ అధ్యక్షుడు చంద్రశేఖర్, టేకా అధ్యక్షుడు చంద్ర, తెలంగాణ అధ్యక్షుడు సంపత్‌ పాల్గొన్నారు. 
     
     
     
మరిన్ని వార్తలు