జాతీయ టెన్నికాయిట్‌ పోటీలకు విద్యార్థి

7 Sep, 2016 23:43 IST|Sakshi
పెద్దారవీడు : మండలంలోని దేవరాజుగట్టు జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఆర్‌. దుర్గాప్రసాద్‌ నాయక్‌ ప్రకాశం జిల్లా నుంచి జాతీయ స్థాయి టెన్నికాయిట్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలకు స్టాండ్‌బైగా ఎంపికైన ట్లు హెచ్‌ఎం విశ్వనాథశర్మ బుధవారం తెలిపారు. ఆగస్టు 26,27,28వ తేదీల్లో విజయనరం జిల్లా సీతానగరంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి టెన్నికాయిట్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో ఆర్‌. దుర్గాప్రసాద్‌ నాయక్‌ పాల్గొని మంచి ప్రతిభ కనపరచి జాతీయ స్థాయి టెన్నికాయిట్‌ పోటీలకు స్టాండ్‌బైగా ఎంపిక చేశారని జిల్లా టెన్నికాయిట్‌  అసోసియేషన్‌ కార్యదర్శి కె. బాపూజీ పేర్కొన్నారు. ఈ నెల మూడో వారంలో చెన్నైలో జరిగే పోటీలో పాల్గొంటారని వ్యాయామ ఉపాధ్యాయుడు పి. రామానాయక్‌ తెలిపారు.
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు