కాకినాడకు డీజీఎఫ్‌టీ

19 Oct, 2016 23:24 IST|Sakshi
కాకినాడకు డీజీఎఫ్‌టీ
భానుగుడి (కాకినాడ) : విదేశీ వస్తువుల దిగుమతులు, స్వదేశీ వస్తువుల ఎగుమతి వంటి వ్యాపార కార్యకలాపాలను కాకినాడ సీపోర్టు నుంచి నిర్వహించేందుకు, విదేశీ వర్తకాన్ని కాకినాడ నుంచి నేరుగా సాగించేందుకు ప్రతిష్టాత్మక డీజీఎఫ్‌టీ (డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారన్‌ ట్రేడ్‌) రీజనల్‌ కార్యాలయం త్వరలో కాకినాడలో ఏర్పాటుకానున్నటు ఎంపీ తోట నరసింహం తెలిపారు. బుధవారం కాకినాడలో తన కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో సంస్థ ఏర్పాటుకు సంబం«ధించి విషయాలను వెల్లడించారు. మినిస్ట్రీ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ అధీనంలో పనిచేసే ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 36 రీజినల్‌ కార్యాలయాలున్నాయని, కాకినాడ 37వది అవుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ప్యాకేజింగ్‌ స్టాండర్స్‌కు అనుగుణంగా జిల్లా విద్యార్థులకు ప్యాకేజింగ్‌ రంగంలో శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించేందుకు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకింగ్‌ను, మినిస్ట్రీ ఆఫ్‌ టెక్స్‌టైల్స్‌ అధీనంలో పనిచేసే నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ(నిఫ్ట్‌)ను కాకినాడలో త్వరలో ఏర్పాటు చేయనున్నామన్నారు. కాకినాడ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 53 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనికి 70 శాతం నిధులను ప్రభుత్వం సమకూరుస్తుండగా, 30 శాతం స్వచ్ఛంద సంస్థలు ఇస్తున్నాయన్నారు. జిల్లాలో వంద పాఠశాలల్లో డిజిటల్‌ తరగతుల ఏర్పాటుకు దివాన్‌చెరువు గ్రామానికి చెందిన చత్రాతి రామచంద్రుడు మహాలక్ష్మమ్మ చారిటబుల్‌ ట్రస్ట్‌ ముందుకు రావడం హర్షించదగ్గ విషయమన్నారు. రూ.వంద కోట్లతో కాకినాడ సిటీ, పోర్టు రైల్వేస్టేçÙన్ల ఆధునికీకరణకు ప్రతిపాదనలు పంపినట్టు ఆయన తెలిపారు.
 

 

 
మరిన్ని వార్తలు