అన్ని పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు

21 Oct, 2016 00:35 IST|Sakshi
కరప : 
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు డీఈఓ ఆర్‌.నరసింహారావు తెలిపారు. నక్కా సూర్యనారాయణమూర్తి జెడ్పీ ఉన్నత పాఠశాలను గురువారం ఆయన సందర్శించి డిజిటల్‌ తరగతిని పరిశీలించి ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ చత్రాతి రామచంద్రుడు మహాలక్ష్మమ్మ చారిటబుల్‌ ట్రస్ట్‌ అధినేత సీహెచ్‌ రామచంద్రరావు సహకారంతో జిల్లాలో 100 డిజిటల్‌ తరగతులు, ప్రభుత్వ నిధులతో 17 డిజిటల్‌ తరగతులు ప్రారంభిస్తున్నామన్నారు. జిల్లాలో 660 పాఠశాలలున్నాయని, దశలవారీగా అన్నింటిలో డిజిటల్‌ తరగతులు ప్రారంభిస్తామన్నారు. ఒక డిజిటల్‌ తరగతికి రూ.1.50 లక్షలు ఖర్చవుతుందని రెండు కంప్యూటర్లు, ప్రొజెక్టర్, మానిటర్‌ సమకూరుస్తామన్నారు. దాతలు ముందుకువచ్చి రూ.45 వేలు విరాళంగా ఇస్తే ప్రభుత్వం రూ.1.05 లక్షలు ఇస్తుందన్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు అన్నిసబ్జెక్టులకు 3డీలో విద్యాబోధన జరుగుతుందన్నారు. 
10వ తరగతి పరీక్షలకు కార్యాచరణ
ఈ ఏడాది కొత్తపద్ధతి (సీసీ మెథడ్‌)లో 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నందున మంచిఫలితాలు సాధించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్టు డీఈఓ తెలిపారు. పాతపద్ధతిలో ఇచ్చినట్టుగా స్టడీమెటేరియల్‌ ఇవ్వబోమన్నారు. రామచంద్రపురం డీవై ఈఓ ఆర్‌ఎస్‌ గంగాభవానీ, ఎంఈఓ ఎంవీవీ సుబ్బారావు, హెచ్‌ఎం ప్రసాద్, స్టాప్‌సెక్రటరీ కె.సాంబశివరావు, పీఎ¯ŒSవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు.
 
>
మరిన్ని వార్తలు