జిల్లా స్థాయి వాలీబాల్‌ విజేత సబ్బవరం

16 Aug, 2016 19:51 IST|Sakshi
జిల్లా స్థాయి వాలీబాల్‌ విజేత సబ్బవరం
మునగపాక: కళాకారులు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గ్రామీణ యువజన మందిరం అందిస్తున్న  సేవలు అభినందనీయమని ఆర్‌ఈసీఎస్‌ మాజీ చైర్మన్‌ బొడ్డేడ ప్రసాద్‌ కొనియాడారు. క్రీడాకారులు కూడా తమలో ఉన్న ప్రతిభను వెలికితీసి ఉన్నత స్థానాలను అధిరోహించాలన్నారు. గ్రామీణ యువజన మందిరం 52వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఆయన సోమవారం రాత్రి బహుమతిప్రధానం చేశారు. ఈసందర్బంగా ప్రసాద్‌ మాట్లాడుతూ క్రీడల ద్వారా శారీరక దారుడ్యంపెరగడంతోపాటు మానసిక ఉల్లాసం పెరుగుతుందన్నారు. యువజన మందిరం ద్వారా ఏటా కళాకారులు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇటువంటి పోటీలు నిర్వహించడం సంతోషదాయకమన్నారు. క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో తగిన గుర్తింపు పొందాలన్నారు. క్రీడల్లో రాణించేవారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉంటాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది క్రీడాకారులున్నారని వారిని ప్రోత్సహిస్తే ఉన్నత స్థానాలకు చేరుకుంటారన్నారు. 
 
సబ్బవరం జట్టుకు ప్రథమ బహుమతి..
జిల్లాస్థాయి వాలీబాల్‌ పోటీల్లో సబ్బవరం జట్టు ప్రథమ స్థానం కైవసం చేసుకుంది.గాజువాకకు చెందిన మోడల్‌ జట్టు ద్వితీయ స్థానం, తోటాడ మూడో స్థానాన్ని స్థానాన్ని, మునగపాక టీమ్‌ నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. 
 
మరిన్ని వార్తలు