ఆదివాసీలను చీల్చేందుకు కుట్ర

24 Aug, 2016 22:45 IST|Sakshi

జిల్లాల విభజనపై వరవరరావు

ఇల్లెందు: జిల్లాల విభజనలో ఆదివాసీలను చీల్చే ప్రయత్నం సాగుతోందని విప్లవ కవి వరవరవరావు అన్నారు. తెలంగాణ ప్రజాఫ్రంట్ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర బుధవారం ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలంలో పర్యటించింది. ఒంపుగూడెం, కొమురారం, బద్రూ తండాల్లో పోడు భూముల్లో ధ్వంసం చేసిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, జైరాంరమేష్‌ల కుట్రల ఫలితంగా 7 మండలాలు, 3 లక్షల ప్రజలను ఆంధ్రాలో విలీనం చేశారన్నారు.

ప్రస్తుతం జిల్లాల విభజనలో నాలుగు ఆదివాసీ జిల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ఆదివాసీ ప్రాంతాలను చీల్చి కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఆదివాసీలు మనుగడ కోసం, భూముల కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ఏ పోరాటం జరిగినా ఆదివాసీలే ఆ పోరాటానికి నాయకత్వం వహిస్తున్నారని వరవరరావు తెలిపారు.

మరిన్ని వార్తలు