వైఎస్ జగన్కు వైద్య పరీక్షలు

9 Oct, 2015 10:38 IST|Sakshi
వైఎస్ జగన్కు వైద్య పరీక్షలు

గుంటూరు : ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నినదిస్తూ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష మూడోరోజుకు చేరింది. శుక్రవారం ఉదయం ఆయనకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. మూడు రోజులనుంచి దీక్ష చేస్తున్న జగన్‌ బాగా నీరసించారు.  ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ వైఎస్ జగన్ కొంచెం నీరసంగా కనిపిస్తున్నారని, కాకపోతే  బీపీ, షుగర్ (బీపీ: 110/70, షుగర్ లెవల్స్ : 94 ఎంజీ, పల్స్: 80) నార్మల్గానే ఉన్నాయన్నారు. వెయిట్ లాస్ కూడా లేదని, కొంతవరకూ స్టేబుల్గా ఉన్నట్లు చెప్పారు. అయితే దీక్ష ఇలాగే కొనసాగిస్తే రేపు ప్రత్యేక పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు.

కాగా గుంటూరు నల్లపాడు రోడ్డులో బుధవారం మధ్యాహ్నాం 2గంటల 15 నిమిషాలకు వైఎస్‌ జగన్‌ దీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వెల్లువలా వస్తున్న జనాన్ని పలకరిస్తూనే ఉన్నారు. మద్దతు తెలిపేందుకు దీక్షవేదిక వద్దకు ప్రతిఒక్కరికి అభివాదం చేస్తూ పలకరిస్తున్నారు. గంటగంటకూ పెరుగుతన్న జనం...ఆయన దగ్గర వచ్చేందుకు చేయి కలిపేందుకు ఉత్సాహం చూపటంతో అదుపు చేయటం భద్రతా సిబ్బందికి కష్టంగా మారింది.

మరిన్ని వార్తలు