అంగన్‌వాడీల్లో ఆంగ్లవిద్య బోధన

13 Mar, 2017 23:57 IST|Sakshi
ఆర్‌జేడీ శారద 
ఆలూరు రూరల్‌ : అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో ఆంగ్లవిద్యను అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఐసీడీఎస్‌ రీజనల్‌ డైరెక్టర్‌ శారద తెలిపారు. సోమవారం ఆలూరు ఐసీడీఎస్‌ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వీరేష్‌ను పరామర్శించేందుకు పీడీ అరుణతో కలిసి ఆలూరుకు వచ్చారు.
 
అనంతరం స్థానిక సీడీపీఓ కోటేశ్వరితో కలిసి ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాయలసీమ జిల్లాల్లో మొత్తం 17,062 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయన్నారు. ఆయా జిల్లాల్లో ఇప్పటివరకు 2,300 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎల్‌కేజీ, యూకేజీ కోర్సులను ప్రారంభించామన్నారు.   అంగన్‌వాడీ కేంద్రాల్లో రాబోవు రోజుల్లో బయోమెట్రిక్‌ విధానాన్ని కూడా అమలు చేస్తామన్నారు. వివిధ కారణాలచేత కోడిగుడ్లు , ప్రభుత్వం సరఫరాచేసే పాలప్యాకెట్లు చెడిపోయినట్లయితే వాటిని వెంటనే పారవేసి విషయాన్ని సంబంధిత సూపర్‌వైజర్లకు, సీడీపీఓలకు తెలియజేయాలన్నారు. వేసవికాలం ప్రారంభమైన నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాలు మధ్యాహ్నం వరకే నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
 
మరిన్ని వార్తలు