పొదుపుతోనే ఆర్థిక భద్రత

28 Oct, 2016 22:01 IST|Sakshi
  • నాబార్డ్‌ ఏపీ సీజీఎం సత్యనారాయణ
  • అమలాపురం టౌ¯ŒS : 
    పొదుపుతోనే ప్రతి వ్యక్తికి ఆర్థిక భద్రత లభిస్తుందని నాబార్డ్‌ ఏపీ సీజీఎం వీవీవీ సత్యనారాయణ అన్నారు. బ్యాంకుల సేవలను నూరు శాతం సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక భద్రత కల్పించుకోవాలని ఆయన సూచించారు. స్థానిక ఏఎస్‌ఎ¯ŒS కళాశాలలో శుక్రవారం జరిగిన వివిధ బ్యాంకర్లతో జరిగిన ఆర్థిక సమ్మిళిత అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫైనాన్సియల్‌ సర్వీస్‌ డిపార్ట్‌మెంట్, మినిస్ట్రీ ఫైనా¯Œ్స, జిల్లా లీడ్‌ బ్యాంక్‌ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో జిల్లాకు చెందిన అన్ని బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. మహిళా శక్తి సంఘాల ప్రతినిధులు, చిరు వ్యాపారులు, రైతు క్లబ్‌ల ప్రతినిధులు, రైతు మిత్రులు కూడా హాజరై బ్యాంకుల నుంచి సేవలను పొందే విషయాలపై సందేహాలను అధికారుల ముందు ఉంచి నివృత్తి చేసుకున్నారు. వివిధ బ్యాంకుల అధికారులు సమన్వయం, సహకారంతో ఆర్థిక సమ్మిళితకు పాటు పడాలని సదస్సు నిర్ణయించింది. జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ బీవీఎం సుబ్రహ్మణ్యం, డీసీసీబీ సీఈవో మంచాల ధర్మారావు, నాబార్డు జిల్లా అభివృద్ధి అధికారి డాక్టర్‌ కేవీఎస్‌ ప్రసాద్, జిల్లా చిన్న పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మ¯ŒS టి.శ్రీనివాసరావు సదస్సులో ప్రసంగించారు. సాంకేతిక సేవలను ఎలా ఉపయోగించుకుని ఆర్థిక భద్రత కల్పించుకోవాలని అనే అంశాలపై బ్యాంకుల ఉన్నతాధికారులు అవగాహన కల్పించారు.   
     
     
>
మరిన్ని వార్తలు