బడికి వెళ్లాలంటే వాగులు దాటాల్సిందే

2 Aug, 2016 00:01 IST|Sakshi
తెర్నేకల్లు పాఠశాలకు వెళ్లేందుకు వాగును దాటుతున్న పలకూర బండ విద్యార్థులు
ఆస్పరి మండలం ములుగుందం మజరా గ్రామమైన పలకూర బండకు విద్యార్థులు బడికి వెళ్లాలంటే ప్రమాదకరమైన వాగులను దాటి వెళ్లాల్సి వస్తోంది. గ్రామం నుంచి 25 మంది విద్యార్థులు దేవనకొండ మండలం తెర్నేకల్లు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో చదువుకోవడానికి వెళ్లుతున్నారు. సుమారు మూడు కిలో మీటర్లు దూరంలో ఉన్న ఆగ్రహారం వరకు వెళ్లి అక్కడ నుంచి బస్సుకు తెర్నేకల్లు పాఠశాలకు వెళ్లుతున్నారు. ఇటీవల కరుస్తున్న వర్షాలకు పలకూరబండ, ఆగ్రహారం మధ్య ఉన్న మూడు పెద్ద వాగుల్లో నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. ప్రతి రోజు వాగుల్లో నీటిని దాటుతూ పాఠశాలకు వెళ్లుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన చెందుతున్నారు. వాగులకు బ్రిడ్జిలు నిర్మించాలని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వారు అవేదన చెందుతున్నారు.  
– ఆస్పరి
 
మరిన్ని వార్తలు