పేరిణీకి పూర్వ వైభవం

23 Jun, 2016 08:07 IST|Sakshi
పేరిణీకి పూర్వ వైభవం

కోర్సుల్లో అధికారికంగా చేర్పు
జీఓ విడుదలపై కళాకారుల హర్షం

 సిద్దిపేట జోన్: తెలంగాణకు చెందిన కాకతీయ కాలం నాటి పేరిణీ నృత్యానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్వవైభవం సంతరింపజేసేందుకు అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంగీత, నృత్య కళాశాలలు, పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి పేరిణీ నృత్యాన్ని కోర్సు రూపంలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాకతీయ కాలంలో పేరిణీ నృత్యం విస్తృత ఆదరణ పొంది కొన్ని దశాబ్దాలుగా నిరాదరణకు గురైంది. దీంతో పేరిణీ కళకు రాష్ర్ట ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు అందించేందుకు సంకల్పించింది.

ఆ దిశగా పేరిణీ నృత్య కోర్సులను ఈ ఏడాది నుంచే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ముగ్గురు నిపుణులతో కూడిన నృత్య కోర్సును పాఠ్యాంశాలుగా రూపొందించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సాంస్కృతిక శాఖకు ఆదేశాలు జారీ చేయడంపై పేరిణీ కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేరిణీ నృత్యానికి గుర్తింపు తీసుకొచ్చే ప్రక్రియలను చేపట్టడం అభినందనీయమని సిద్దిపేటకు చెందిన ప్రముఖ పేరిణీ కళాకారులు పేరిణీ రమేష్‌లాల్, పేరిణీ సంతోష్, పేరిణీ మల్లేశం, పేరిణీ వాసు, పేరిణీ జయప్రద సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు