బాస్కెట్‌బాల్‌పోటిల్లో లోకేష్‌కు స్వర్ణం

31 Aug, 2016 21:31 IST|Sakshi
బాస్కెట్‌బాల్‌పోటిల్లో లోకేష్‌కు స్వర్ణం
బాలాజీచెరువు( కాకినాడ) : 
జాతీయ బాస్కెట్‌ బాల్‌ పోటీల్లో తమ విద్యార్థి గొల్లపల్లి లోకేష్‌ (బీసీఏ) ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించినట్టు ఆదిత్య డిగ్రీ, పీజీ కళాశాల కో–ఆర్డినేటర్‌ బీఈవీఎల్‌ నాయుడు బుధవారం తెలిపారు. ఆగస్టు 26 నుంచి 29వ తేదీ వరకూ తమిళనాడులో జరిగిన 6వ జాతీయ బాస్కెట్‌బాల్‌ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ తరఫున ఆడిన లోకేష్‌  ప్రథమ స్థానం సాధించాడన్నారు. లోకేష్‌ను ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్‌ ఎన్‌.శేషారెడ్డి, కార్యదర్శి కృష్ణదీపక్‌ రెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ సి.సత్యనారాయణ, ఫిజికల్‌ డైరెక్టర్‌ డి.ప్రసాద్‌ తదితరులు అభినందించారు.
 
మరిన్ని వార్తలు