ప్రతాప్‌ సింగ్‌కు పసిడి పతకం

2 Nov, 2023 02:33 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షిప్‌ను భారత్‌ స్వర్ణ పతకంతో ముగించింది. పోటీల చివరిరోజు బుధవారం భారత్‌ ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక  కాంస్యం సాధించింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్స్‌ వ్యక్తిగత విభాగంలో ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌ పసిడి పతకం గెలిచాడు. ఫైనల్లో ప్రతాప్‌ సింగ్‌ 463.5 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్, అఖిల్‌ షెరాన్, స్వప్నిల్‌ కుసాలేలతో కూడిన భారత బృందం ఇదే విభాగంలో టీమ్‌ ఈవెంట్‌లో 1764 పాయింట్లతో రజత పతకం కైవసం చేసుకుంది. 

పురుషుల 25 మీటర్ల సెంటర్‌ ఫైర్‌ పిస్టల్‌ ఈవెంట్‌ వ్యక్తిగత విభాగంలో ప్రదీప్‌ సింగ్‌ షెఖావత్‌ 582 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత బృందం 8 స్వర్ణాలు, 10 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి 22 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది.   

మరిన్ని వార్తలు