ప్రభుత్వం దృష్టికి మందుల సమస్య

29 Nov, 2016 01:57 IST|Sakshi
శ్రీకాకుళం అర్బన్: జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో లేని రక్తపోటు(బీపీ), మధుమేహ వ్యాధి (సుగర్), మూర్చ(ఫిట్స్) వ్యాధుల కు సంబంధించిన మందులు సరఫ రా చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సనపల తిరుపతిరావు అన్నారు. జిల్లాలో అమలు జరుగుతున్న చంద్రన్న సంచా ర చికిత్స సేవలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వైద్యులతో సోమవారం సమీక్షించారు. మధుమేహ వ్యాధి నిర్ధారణకు అవసరమైన గ్లూకో స్లిప్స్, నీటి నమూనా పరీక్షలకు అవసరమైన రసాయనాల పంపిణీకి చర్యలు తీసుకుంటామన్నారు.
 
 జిల్లాలోని అన్ని ప్రాథిమి క ఆరోగ్య కేంద్రాల ల్యాబ్ టెక్నీయన్లకు నీటి నమూనా పరీక్షలపై శిక్షణ ఇస్తామన్నారు. సమావేశంలో ఫిరామల్ సంస్థ ప్రతినిధులు క్లినికల్ డోమైన్ చీఫ్ డాక్టర్ డి.సుధాకర్ పట్నాయక్, ప్రాంతీయ అధికారి కె.భాస్కర్, జిల్లా అధికారి కె.శంకరనారాయణ, చంద్రన్న సంచార చికిత్స సేవల జిల్లా నోడల్ అధికారి డాక్టర్ బి.జగన్నాథరావు, జబర్ కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎం.ప్రవీణ్, డీఎంహెచ్‌వో ఏవో ధవళ భాస్కరరావు, జిల్లా ఆస్పత్రి సేవల సమన్వయ అధికారి బి. సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు