కేంద్ర మంత్రికి ఘన స్వాగతం

3 Jan, 2017 00:54 IST|Sakshi
కేంద్ర మంత్రికి ఘన స్వాగతం

శంషాబాద్‌: కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి విజయ్‌ గోయల్‌కు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో బీజేపీ నాయకులు సోమవారం ఘన స్వాగతం పలికారు. నగరంలోని ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయనకు విమానాశ్రయంలో పుష్పగుచ్ఛాలు అందించి.. శాలువాలతో సత్కరించారు. స్వాగతం పలికిన వారిలో బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, మండల అధ్యక్షుడు చిటికెల వెంకటయ్య, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ ప్రేమ్‌రాజ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బైతి శ్రీధర్, కె. రమేష్‌ గౌడ్‌ తదితరులు ఉన్నారు.
 

మరిన్ని వార్తలు