దుర్గగుడిపై కొనసాగుతున్న రద్దీ

17 Aug, 2016 23:35 IST|Sakshi
దుర్గగుడిపై కొనసాగుతున్న రద్దీ
విజయవాడ(ఇంద్రకీలాద్రి) : 
దుర్గగుడిలో అమ్మవారి దర్శనానికి బుధవారం భక్తుల రద్దీ నెలకుంది. పుష్కరాలలో ఆరో రోజైన బుధవారం 1.30 లక్షల మంది పుష్కర యాత్రికులు అమ్మవారిని దర్శించుకున్నారు. గవర్నర్‌ నరసింహన్‌తోపాటు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ.రమణ, మంత్రులు శిద్దా రాఘవరావు,  ప్రత్తిపాటి పుల్లారావు అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచి రాత్రి 11 గంటల వరకు పుష్కర యాత్రికుల రద్దీ కొనసాగుతూనే ఉంది. అమ్మవారి దర్శనానికి ఉచిత క్యూలైన్లతోపాటు శీఘ్రదర్శనం, వీఐపీ దర్శనాలకు భక్తులు బారులు తీరారు. అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని  పుష్పాలతో అలంకరించారు. 
6వ రోజు ఆదాయం రూ.18. 24లక్షలు
పుష్కరాలను పురష్కరించుకుని అమ్మవారి దేవస్థానానికి ఆరో రోజు రూ. 18.24 లక్షల ఆదాయం సమకూరింది. లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.14 లక్షలు, మూడు వందల టికెట్ల విక్రయం ద్వారా రూ. 2.10 లక్షలు,  రూ.5 వందల టికెట్ల విక్రయం ద్వారా రూ. 57,500, భవానీ ప్రసాదం విక్రయం ద్వారా రూ. 1.20 లక్షల మేర ఆదాయం సమకూరింది. కేశకండన టికెట్ల విక్రయం ద్వారా రూ. 34,500 ఆదాయం సమకూరింది.
 
మరిన్ని వార్తలు