నీరు లేకుండా జాతికి అంకితమా!

16 Aug, 2017 23:49 IST|Sakshi
నీరు లేకుండా జాతికి అంకితమా!
వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి
పురుషోత్తపట్నం పథకంపై ఎద్దేవా
సీతానగరం (రాజానగరం) : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జిమిక్కులతో ప్రజలను మోసం చేయవచ్చని అనుకుంటున్నారని, వాటిని మానుకోవాలని వైఎస్సార్‌ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి సూచించారు. బుధవారం సీతానగరంలో ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆమె విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు పలు విధాలుగా ప్రజలను మోసం చేస్తూ వచ్చారని, ఆయన మాటలు ప్రజలు నమ్మడం లేదని గుర్తు చేశారు. దీనికి నిదర్శనం నంద్యాల ఎన్నికలేనన్నారు. రూ 1,640 కోట్లతో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నెలకొల్పి, కమీషన్లు రూపంలో వందలాది కోట్లు తమ జేబులో వేసుకుంటున్నారన్నారు. పథకం పనులు పూర్తి కాకుండానే చంద్రబాబు జాతికి అంకితం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పలుమార్లు జాతికి అంకితం చేశారని,  అలాగే పురుషోత్తపట్నం పథకాన్నీ ప్రారంభిస్తారన్నారు. పరిహారం అందించడకుండా రైతులను గృహనిర్బంధాలు చేసి, సెక్షన్‌ 30, 144 వంటి పలు సెక్షన్‌లు రాష్ట్రంలో ఉంచి పాలన జరిపే ఘనత చంద్రబాబుదేనన్నారు. ఈ నెల 15న పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ప్రార ంబోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు మోటార్లను తిప్పి నీరు వచ్చిందని భావించి గొప్పగా జాతికి అంకితం చేశామని డప్పులు కొట్టుకునే రీతికి టీడీపీ ప్రభుత్వం వచ్చిందన్నారు. పోలవరం ఎడమ కాలువలోకి పరుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నుంచి చుక్క నీరు కూడా రాలేదని, పైప్‌లైన్‌ పనుల పూర్తి కాకుండానే పథకాన్ని జాతికి అంకితం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని కించపరుస్తూ సీఎం అంటే, మేము తీసిపోలేదన్నట్లుగా ఎస్సీలు చదువుకోరు, శుభ్రంగా ఉండరు అని టీడీపీ మంత్రులు అంటున్నారని, ఎస్సీలను ఎప్పటికప్పుడు హేళన చేసి మాట్లాడటం సరికాదని హితవుపలికారు. పార్టీ మండల కన్వీనర్‌ పెదపాటి డాక్టర్‌బాబు, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి వలవల రాజా, రాష్ట్ర సేవాదళ్‌ కార్యదర్శి చల్లమళ్ల సుజీరాజు, జిల్లా కమిటీ కార్యదర్శి వలవల వెంకట్రాజు, ఎస్సీసెల్‌ మండల అధ్యక్షుడు అంబటి రాజు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు