కుల ధ్రువీకరణ పత్రాలపై జేసీ విచారణ

28 Jan, 2017 00:11 IST|Sakshi
కర్నూలు(అగ్రికల్చర్‌): కుల ధ్రువీకరణ పత్రాల జారీపై జాయింట్‌ కలెక్టర్‌ హరికరణ్‌ విచారణ జరిపారు. తమకు తహసీల్దార్లు మదాసి కురువ ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఐదుగురు జేసీ కోర్టులో అఫీల్‌ చేశారు. వీటిపై డీఎల్‌ఎస్‌సీ కమిటీ సమావేశంలో విచారణ నిర్వహించారు. మహేశ్వరమ్మ, రాఘవేంద్ర, భీమయ్య, రామాంజనేయులు, మల్లయ్యలు చేసుకున్న అపీళ్లపై విచారణ జరిపారు. కృష్ణ సాయి అనే యువకుడు తొగట కులం కింద బీసీ–బి సర్టిఫికెట్‌తో ఎంబీబీఎస్‌లో సీటు సంపాదించారు. అయితే ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ అధికారులకు అనుమానం రావడంతో విచారణ జరుపాలని జిల్లా కలెక్టర్‌కు సర్టిపికెట్‌ను పంపారు. దీనిపై కూడా జేసీ విచారణ నిర్వహించారు. లింగమూర్తి అనే వ్యక్తికి జారీ చేసిన మాలదాసరి సర్టిఫికెట్‌పై కూడా విచారణ నిర్వహించారు. అయితే వీటిపై నిర్ణయం తీసుకోలేదు. అన్నిటిని వాయిదా వేశారు. 
 
మరిన్ని వార్తలు