త్వరలో ఖేలో ఇండియా

3 Dec, 2016 02:11 IST|Sakshi
త్వరలో ఖేలో ఇండియా

కేంద్ర యువజన సర్వీసుల క్రీడాశాఖ ఆధ్వర్యంలో నిర్వహణ
విజేతలకు భారీ నజరానాలు
పోటీల నిర్వహణకు రంగం సిద్ధం
విజేతలకు స్కాలర్‌షిప్‌లు కూడా..
పాత, కొత్త జిల్లాలపై తేలని సందిగ్ధం
త్వరలో ఖరారుకానున్న షెడ్యుల్
 

కరీంనగర్ స్పోర్‌‌ట్స : ప్రపంచ జనాభాలో రెండో స్థానంలో ఉన్న మన దేశం క్రీడల్లో మాత్రం వెనకబడి ఉంది. ఒలింపిక్స్ వంటి మెగా ఈవెంట్లో సైతం కేవలం రెండు, మూడు పతకాలకే ఇండియా పరిమితమవుతోంది. మనకన్నా చిన్నదేశాలు సైతం అత్యధిక పతకాలు సాధిస్తూ అగ్రస్థానాల్లో నిలుస్తున్నారుు. 2016 ఒలింపిక్స్‌లో మన క్రీడాకారుల వైఫల్యాన్ని గమనించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రీడారంగాన్ని కూడా ప్రపంచదేశాల సరసన నిలబెట్టే క్రమంలో ’ఖేలో ఇండియా’ కు శ్రీకారం చుట్టారు. 2024 ఒలింపిక్స్‌లో వివిధ క్రీడల్లో 50 పతకాలు లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడారత్నాలను వెలికితీసే దిశగా కేంద్ర యువజన సర్వీసుల క్రీడాశాఖ ఆధ్వర్యంలో మండలస్థారుు నుంచి జాతీయస్థారుు వరకు వివిధ క్రీడల్లో పోటీలను నిర్వహించనుంది.

 భారీ నజరానాలు
 క్రీడాకారులు వారు సాధించిన స్థానం ప్రకారం కేంద్రం ‘ఖేలో ఇండియా’ కింద భారీ నజరానాలు ఇస్తుంది. గతేడాదితో పోలిస్తే ఇప్పుడది మూడింతలకు పెరిగింది. అరుుతే మండలస్థారుులో నజరానాలకు మాత్రం ఫుల్‌స్టాప్ పెట్టింది. గతంలో జిల్లాస్థారుు లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి రూ.350, రూ.250, రూ.150 ఇచ్చారు. ఇప్పుడది రూ.2000, రూ.1500, రూ.1000 పెరిగింది. అలాగే రాష్ట్రస్థారుులో విజేతలకు రూ.50 వేలు, రూ.30వేలు, రూ.20 వేలు అందించనున్నారు. కనీస ప్రోత్సాహం సైతం లేని ఆర్థిక ఇబ్బందులు పడుతున్న క్రీడాకారులకు కేంద్రం అందించిన నగదు అవార్డు గొప్ప వరం కానుంది.


 పదా...ముప్పై ఒకటా?
 కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఖేలో ఇండియా పోటీలు నిర్వహించనున్న నేపథ్యంలో 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ రాష్ట్రం 31 జిల్లాలుగా మారింది. దీంతో పోటీల నిర్వహణ పాత పది జిల్లాలను పరిగణలోకి తీసుకుంటారా లేక పెరిగిన జిల్లాల ప్రకారం నిర్వహిస్తారన్న సందేహంలో ఉన్నారు క్రీడాకారులు, క్రీడా విశ్లేషకులు. వాస్తవానికి పోటీలకు సంబంధించిన బడ్జెట్ ను మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. మరి ఎప్పుడో షెడ్యుల్ ను ఖరారు చేసిన కేంద్రం ఏ జిల్లాల ప్రాతిపదికన పోటీలు నిర్వహించాలని సంకేతాలు జారీ చేస్తుందో చూడాల్సిందే.

 తగ్గిన క్రీడలు...
ఖేలో ఇండియా పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లా, రాష్ట్రస్థారుులో పోటీల నిర్వహణకు సంబంధించిన క్రీడలను కుదించారు. గతంలో కేంద్రం నిర్ణరుుంచిన 10 క్రీడల్లో జిల్లా, రాష్ట్ర, జాతీయస్థారుు పోటీ లు జరిగారుు. అరుుతే ఈ ఏడాది నుంచి జిల్లాస్థారుులో ఐదు క్రీడలు (ఇందులో 3 వ్యక్తిగత క్రీడలు , 2 టీం క్రీడలు), రాష్ట్ర స్థారుులో 8 క్రీడలకు అనుమతినిచ్చారు. అందులో స్పోర్‌‌ట్స అథారిటీ నిర్ణరుుంచిన 21 క్రీడాంశాల్లో ఏయే క్రీడలకు చోటును కల్పించారో తెలియాల్సి ఉంది.

 ఆ 21 క్రీడలు....
 అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, టీటీ, అర్చ రీ, వుషూ, తైకై ్వండో, రెజ్లింగ్, సైక్లింగ్, బాక్సింగ్, జూడో, వెరుుట్ లిఫ్టింగ్, కబడ్డీ, ఖోఖో, హాకీ, ఫుట్‌బాల్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, హ్యండ్‌బాల్, టెన్నీస్ క్రీడల్లో జిల్లాస్థారుు, రాష్ట్రస్థారుు పోటీల నిర్వహణకు సంబంధించి ఇంత వరకు క్రీడలను ఖరారు చేయలేదు.స్పోర్‌‌ట్స అథారిటీ ఆఫ్ ఇండియా ఎంపిక చేసిన పై 21 క్రీడల్లోనే పోటీలు జరుగనున్నారుు.

 క్రీడాకారులకు స్కాలర్‌షిప్‌లు..
 పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు నజరానాతో పాటు ఏడాది పాటు స్కాలర్‌షిప్ ఇవ్వనున్నారు. జిల్లా స్థారుులో నెలకు రూ.వెరుు్య చొప్పున పోటీల సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన క్రీడాకారులకు సంవత్సరాంతం ఇవ్వనున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలోకూడా ఎంపికై న క్రీడాకారులకు  స్కాలర్‌షిప్ ఇవ్వనున్నారు.

 రెండు విభాగాల్లో...
 గతంలో కేంద్రం నిర్వహించిన గ్రామీణ క్రీడలు, పైకా, ఆర్‌జీకేవీ క్రీడలకు కేవలం ఒక కేటగిరీలో పోటీలను నిర్వహించ గా ‘ఖేలో ఇండియా’లో మాత్రం రెండు విభాగాల్లో పోటీల ను నిర్వహించనున్నారు. అండర్- 14, 17 విభాగాల్లో బాలబాలికలకు వేరు వేరుగా పోటీలను నిర్వహించనున్నారు.

 మండలస్థారుులో ఎంపిక పోటీలే...
 మండల, బ్లాక్, జిల్లా, రాష్ట్ర, జాతీయస్థారుుల్లో దశల వారీగా అట్టహాసంగా నిర్వహించిన ఈ పోటీలకు కేంద్ర ప్రభుత్వం గతంలో పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం మండల స్థారుులో ఎంపిక పోటీలుగానే నిర్వహించనున్నారు.

 త్వరలో షెడ్యూల్...
 ఇప్పటికే జిల్లాస్థాయిలో పోటీలను ముగించాల్సిన ఖేలో ఇండియా  షెడ్యూల్ ఇంకా రాష్ట్రంలో ఖరారు కాలేదు. తెలంగాణ 31 జిల్లాలుగా మారడంతో పోటీల నిర్వాహణ వ్యయంకు సంబంధించి శాట్ అధికారులు కేంద్రానికి నివేదిక పంపించడంలో ఆలస్యమైందని కేంద్రం నుంచి ఆమోదం రాగానే షెడ్యుల్ ఖరారు చేయనున్నట్లు క్రీడాధికారి నుంచి అందిన సమాచారం.

మరిన్ని వార్తలు