యోగా పోటీల్లో కోవూరు వాసుల ప్రతిభ

14 Sep, 2016 00:56 IST|Sakshi
యోగా పోటీల్లో కోవూరు వాసుల ప్రతిభ
 
కోవూరు : ఇటీవల విశాఖపట్నంలో జరిగిన యోగా పోటీల్లో 35 ఏళ్లు పైబడిన జిల్లా స్థాయి యోగా పోటీల్లో కోవూరుకు చెందిన ఈ.రమణయ్య ప్రథమ స్థానం, ఏ శ్రీనివాసులు 35 ఏళ్ల లోపు విభాగంలో ప్రథమ స్థానం సాధించారని యోగా గురువు గోళ్ల రమణయ్య తెలిపారు. కోవూరులో ఆయన మంగళవారం మాట్లాడారు. యోగా అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్‌ శ్యాప్‌ ఆధ్వర్యంలో ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో నెల్లూరుకు చెందిన పలువురు పాల్గొన్నారన్నారు. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఒక్క యోగా వల్లనే సాధ్యమవుతుందన్నారు. ఈ విషయాన్ని 192 దేశాలు గుర్తించి యోగాను ఆచరిస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని యోగాను సాధన చేయాలని ఆయన కోరారు. కోవూరు టీఎన్‌సీ కళాశాలలో చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కేంద్రంలో యోగా సాధన చేస్తున్న ఎంతో మంది రాష్ట్ర స్థాయిలో వివిధ పతకాలు సాధించిన వారు ఎంతో మంది ఉన్నారన్నారు. విజేతలను యోగా జాతీయ కార్యదర్శి మనోహర్, స్వామిజీ యోగానంద్‌ భారతి, రాష్ట్ర కార్యదర్శి రామారావు ప్రతిభ పురస్కారాలు అందుకుని ప్రత్యేక సన్మాన కార్యక్రమాలు చేపట్టారు.
 
మరిన్ని వార్తలు