గ్రంథాలయ సెస్సు వసూలు లక్ష్యం రూ.కోటి

27 Jul, 2016 01:33 IST|Sakshi
సమావేశంలో పాల్గొన్న గ్రంథాలయ సంస్థ సభ్యులు
శ్రీకాకుళం కల్చరల్‌ : గ్రంథాలయ సెస్సు వసూలు లక్ష్యం కోటి రూపాయలుగా నిర్ణయించమని జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు పీరికట్ల విఠల్‌రావు అన్నారు. పట్టణంలోని గ్రంథాలయ సంస్థలో కార్యాలయంలో మంగళవారం జిల్లా గ్రంథాలయ సంస్థ సభ్యుు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాటాల్డుతూ ఈ ఏడాది రూ.40 లక్షల మేర గ్రంథాలయ సెస్సు వసూలైందన్నారు. గత ఏడాది రూ.60లక్షలు వసూలైందని చెప్పారు. ఈ ఏడాది కోటి రూపాయలు వసూలు చేయాలనే లక్ష్యంతో ముందడుగువేస్తున్నామని అన్నారు. గార, కోటబొమ్మాళి, కొత్తూరు గ్రంథాలయాలకు నూతన భవనాలు కోసం రూ.20లక్షలతో ప్రతిపాదించామన్నారు. జిల్లాలో పనిచేయని 14 బుక్‌ డిపాజిట్‌ కేంద్రాలను రద్దు చేసి,  అవసరం ఉన్న చోట వాటిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రాజాం శాఖా గ్రంథాలయం ఏర్పాటై 50 ఏళ్లు పూర్తయినందున త్వరలో స్వర్ణోత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయ నిర్వాహకులు విధి నిర్వహణలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వజ్రపుకొత్తురు గ్రంథాలయాధికారి క్రమశిక్షణ ఉల్లంఘించడంతో సస్పెన్షన్‌ విధించామన్నారు. ఈ సందర్భంగా 2016–17 ఏడాదికి గాను పౌరగ్రంథాలయ సంచాలకుల ఆమోదంతో వచ్చిన బడ్జెట్‌లోని అంచనాలను, వివిధ పద్దుల కింద కేటాయింపులను సభ ఆమోదించింది. సమావేశంలో సంస్థ కార్యదర్శి కె.కుమారరాజా, బోర్డు డైరెక్టర్‌ తెలుగు నాగేశ్వరరావు, డీపీఆర్‌వో ఎల్‌.రమేష్, డీపీవో కార్యాలయ పరిపాలనాధికారి నారాయణరావు, వయోజన విద్య సహాయ ప్రాజెక్టు అధికారి కె.డొంబు, డీఈవో కార్యాలయం సూపరింటెండెంట్‌ ఏ.వి.ప్రసాద్‌ పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు