ప్రియుడే హతమార్చాడు

11 Nov, 2016 01:58 IST|Sakshi
పెనుగొండ : పెనుగొండ మండలం నడిపూడి శివారు కట్టావారిపాలెం గోదావరి తీరంలోని ఇసుకలో లభించిన యువతి మృతదేహం కేసు మిస్టరీ వీడింది. ప్రియుడే ఆమెను హతమార్చి ఇసుకలో పాతిపెట్టాడని పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి గురువారం కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు వివరాలను నర్సాపురం డీఎస్పీ జి.పూర్ణచంద్రరావు విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. పెనుమంట్ర మండలం సోమరాజు ఇల్లింద్రపర్రుకు చెందిన జోగి సీత సోదరుడు సీతారాముడు, అదే గ్రామానికి చెందిన నవీ¯ŒSకుమార్‌ స్నేహితులు. సీత సోదరుడు సీతారాముడు ఉపాధి నిమిత్తం ఇతర దేశాలకు ఏడాది క్రితం వెళ్లాడు. నవీ¯ŒSకుమార్‌ సీతారాముడు ఇంటిలో వారితో స్నేహంగా ఉంటూ సీతతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. సీత తల్లి అమాయకంగా ఉండడంతో సీత, నవీ¯ŒS ఇద్దరూ రాత్రి వేళల్లో కలుస్తుండేవారు. దీంతో సీత గర్భం దాల్చింది. ఇదేవిషయాన్ని ఆమె నవీ¯ŒSకు చెప్పడంతో తన కుటుంబ పరిస్థితులు బాగోలేదని, అబార్షన్‌ చేయించుకోవాలని సూచించి, అందునిమిత్తం రూ. 5వేలు ఇచ్చాడు. ఆ నగదుతో నవీ¯ŒSతోపాటు అతని స్నేహితుడు గూడూరి శ్రీను సీతను ఆసుపత్రులకు తీసుకెళ్లారు. వైద్యులు అబార్ష¯ŒS చేయడం కష్టమని చెప్పడంతో పెళ్లి చేసుకోవాలని సీత కోరింది. దీంతో నవీ¯ŒS సీతను అడ్డు తప్పించుకోవడానికి నిర్ణయించుకుని, అక్టోబరు 22న పెళ్లి చేసుకుందామని నమ్మబలికి నడిపూడి వెళ్దామని చెప్పాడు. దీనిని నమ్మిన సీత ఆటోలో ఉదయం 10.30గంటలకు వెళ్లింది. ముందుగా ఇద్దరూ అనుకున్న ప్రకారం.. గోదావరి తీరంలోకి శారీరకంగా కలవడానికి వెళ్లారు. శారీరకంగా కలిసిన అనంతరం నవీ¯ŒSకుమార్‌ సీతను గొంతునులిమి చంపాడు. ఆ తర్వాత సమీపంలో ఉన్న విసనకర్రతో ఇసుకలో గోతిని తవ్వి పూడ్చాడు. అనంతరం మృతదేహం కాలు బయటకు రావడంతో హత్య విషయం బయట పడింది. నడిపూడి వీఆర్వో సొంగారాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకేసు మిస్టరీని ఛేదించారు.   విచారణలో హత్యకు పాల్పడింది తానేనని నవీ¯ŒSకుమార్‌ అంగీకరించాడు. విలేకరుల సమావేశంలో పెనుగొండ సీఐ సీహెచ్‌ రామారావు, ఎస్‌ఐ బి.వై.కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు