వర్గీకరణ అడ్డుకునేందుకు సిద్ధం కావాలి

12 Oct, 2016 23:36 IST|Sakshi
వర్గీకరణ అడ్డుకునేందుకు సిద్ధం కావాలి
  • మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు అశోక్‌కుమార్‌
  • పిఠాపురం టౌన్‌ :
    ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో, వీటిని అడ్డుకునేందుకు సిద్ధం కావాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు పండు అశోక్‌ కుమార్‌ పిలుపు ఇచ్చారు. స్థానిక చెలికాని భావనరావు సభాసదన్‌లో బు««దlవారం నిర్వహించిన మాలమహానాడు పునర్‌ నిర్మాణసభలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ కన్వీనర్‌ కొంగు నూకరాజు అధ్యక్షత జరిగిన ఈ సభలో ఆయన మాట్లాడుతూ 2004లో పీవీ రావు నాయకత్వంలో అప్పటి అధికార పార్టీలకు బుద్ధి చెప్పిన మాదిరిగా ఇప్పుడూ చెప్పాలని కోరారు. బలమైన కమిటీలను ఏర్పాటు చేసి పోరాటానికి సిద్ధం కావాలని, దళితులకు ఎటువంటి అన్యాయం జరిగినా ఎదిరించడానికి సన్నద్ధం కావాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అధికార పార్టీ కార్యకర్తలకు కాకుండా నిజమైన పేద దళితులకు అందాలని డిమాండ్‌ చేశారు. మాలమహానాడు పేరుతో కొంతమంది చేస్తున్న దందాలు, సెటిల్‌మెంట్లు.. పీపీ రావు స్థాపించిన మాలమహానాడుకు ఎటువంటి సంబంధం లేదన్నారు. అలాంటివారితో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాష్ట్ర అధ్యక్షుడు జి.సూర్యప్రకాష్‌ మాట్లాడుతూ సంక్షేమ పథకాల కోసం ఎస్సీ వర్గీకరణకు తీసుకువచ్చిన జీఓను తక్షణం రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ బ్యాగ్‌లాగ్‌ పోస్టులను భర్తీచేయాలని, చంద్రబాబు అధికారం చేపట్టి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా ఒక్క ఉద్యోగం కూడ భర్తీ చేయలేదని విమర్శించారు. మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు మారెల్ల సోమరాజు, నాయకులు పి.పరశురాముడు, మహిళా విభాగం కన్వీనర్‌ ఎం.సుశీల, బత్తిన శామ్యూల్, కె.చంద్రశేఖర్, మాతా అబ్బులు, ఎడ్ల లక్ష్మీపతి, ఎద్దు నానిబాబు, ఇజ్జిన చలపతిరావు, దారా ప్రభాకరరావు, బొండాడ వీరరాఘవులు, బందిలి నాగేశ్వరరావు మాట్లాడారు. నియోజకవర్గ కమిటీతో పాటు పిఠాపురం, కొత్తపల్లి, గొల్లప్రోలు, మండలాల కమిటీలను ఎంపిక చేశారు.
     
మరిన్ని వార్తలు