షార్టు సర్క్యూట్‌తో మినీ వ్యాన్‌ దగ్ధం

11 Feb, 2017 22:46 IST|Sakshi
షార్టు సర్క్యూట్‌తో మినీ వ్యాన్‌ దగ్ధం

కంకిపాడు : ఇంజన్‌లో షార్టు సర్క్యూట్‌తో మంటలు చెలరేగి మినీ వ్యాన్‌ దగ్ధమైన సంఘటన మండలంలోని ఉప్పులూరు వంతెన సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. విజయవాడ రూరల్‌ మండలం నిడమానూరుకు చెందిన అరవపల్లి దుర్గారావుకు మినీ వ్యాన్‌ ఉంది. గోసాలకు కంకరు అన్‌లోడ్‌ చేసి వ్యాన్‌లో నిడమానూరు వెళ్లేందుకు ఉప్పులూరు మీదుగా బయలుదేరాడు. వ్యాన్‌ ఉప్పులూరు వంతెన వద్దకు చేరుకునే క్రమంలో ఇంజను వైర్లు షార్టు సర్క్యూట్‌కు గురై మంటలు రేగాయి.

ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో వ్యాన్‌ నడుపుతున్న దుర్గారావు ఒక్కసారిగా వ్యాన్‌ని నిలిపివేసి వాహనం దిగేశాడు. మంటలు ఆర్పే ప్రయత్నంలో ప్రధాన గ్రామంలోకి వెళ్లాడు. అప్పటికే మంటలు వ్యాన్‌ను చుట్టుముట్టడంతో అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న గన్నవరం అగ్ని మాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. కుటుంబానికి జీవనాధారమైన వ్యాన్‌ మంటల్లో కాలిపోవటంతో దుర్గారావు బోరున విలపించాడు. 

మరిన్ని వార్తలు