'అవగాహన సదస్సులు నిర్వహిస్తాం'

22 Jan, 2016 17:30 IST|Sakshi

విజయవాడ: రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిలోని మండలాల్లో మాస్టర్ ప్లాన్పై అవగాహన సదస్సులను నిర్వహించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్పై రాజధాని ప్రాంత ప్రజల్లో ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఈ నెల 25 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు తెలిపారు. అలాగే అగ్రికల్చర్ జోన్పై అభ్యంతరాలను స్వీకరించేందుకు ఫిబ్రవరి 15 వరకు గడువు ఉంటుందని తెలిపారు.

ఫిబ్రవరి 1న ల్యాండ్ పూలింగ్, మాస్టర్ ప్లాన్పై నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామకంఠాల సమస్యను సీఆర్డీఏ కమిషనర్, గుంటూరు కలెక్టర్ పరిష్కరిస్తారని నారాయణ స్పష్టం చేశారు.

 

మరిన్ని వార్తలు