బాధితులకు అండగా ఉంటా

18 Apr, 2017 22:55 IST|Sakshi
బాధితులకు అండగా ఉంటా
ఎమ్యెల్యే వంతల రాజేశ్వరి 
మారేడుమిల్లి (రంపచోడవరం) : మండలంలోని చావడికోట పంచాయతీ  సిరిపెనలోవ గ్రామంలో అగ్ని ప్రమాదం నలుగురు చిన్నారులను కోల్పోయిన గిరిజన కుటుంబానికి అన్ని విధాల అండగా నిలుస్తామని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి హామీ ఇచ్చారు. చిన్నారును కోల్పోయిన బచ్చల లక్ష్మిరెడ్డి, పద్మ దంపతులను మంగళవారం ఆమె పరామర్శించారు. రెవెన్యూ శాఖ అందించిన రూ.5 వేల ఎక్స్‌గ్రేషియాతో పాటు, దుస్తులు, వంటసామగ్రి, బియ్యం, నిత్యావసర సరుకులను ఎమ్మెల్యేతో పాటు ఇన్‌చార్జి సబ్‌ కలెక్టర్‌ హెచ్‌.వి.ప్రసాద్‌ బాబు వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒకే కుటుంబంలో నాలుగురు చిన్నారులు మృతి చెందడం దారుణమన్నారు. వారి మృతి తల్లిదండ్రులకు తీరనిలోటున్నారు. ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా రావల్సిన అన్ని సహాయ సహకారాలు త్వరితగతిన అందించేందుకు  అధికారులపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. ఐటీడీఏ అధికారులు ప్రకటించిన మేరకు మృతి చెందిన చిన్నారులు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు చొప్పున తక్షణం అందజేయలన్నారు. ఇటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు సత్తి సత్యనారాయణ రెడ్డి, ఎంపీపీ కుండ్ల సీతామహాలక్ష్మి, తాహసీల్దార్‌ యూరఖాన్‌, వైఎస్సార్‌ సీపీ మండల కార్యదర్శి బి.గంగరాజు తదితరుల పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు